Thursday, April 25, 2024

బండిసంజయ్ దూషణలను టిఆర్‌ఎస్ తీవ్రంగా పరిగణిస్తుంది

- Advertisement -
- Advertisement -
TRS Leaders Fires on Bandi Sanjay Kumar Comments
బండి సంజయ్ ఒక్కడే హిందువా? మేము కాదా?

హైదరాబాద్: బండిసంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడక పోతే మాస్పందన తీవ్రంగా ఉంటుందని, ఆయన వాడుతున్న పదజాలానికంటే తీవ్రమైన పదజాలంతో సమాధానం చెప్పాల్సి ఉంటుందని టిఆర్‌ఎస్ శాసనమండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శానసభ్యులు మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డిలు హెచ్చరించారు. బుధవారం టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, ఎంఎల్‌సి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ విధానాలను తూర్పారబట్టారు. ఏవో గాలివాటంగా రెండుసీట్లు గెలిచినంతమాత్రాన బండి సంజయ్ అదుపులేకుండా, స్థాయిని మర్చి సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ను వ్యక్తిగతంగా బండిసంజయ్ విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ విమర్శలను ఆపకపోతే టిఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని ప్రతివిమర్శలకు దిగాల్సి వవస్తుందని ఆయన హెచ్చరించారు.ఇక నుంచి మీరు ఒక్కటి అంటే మేము పది మాటలతో సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. సాధారణ ఎన్నికలకు ఇంకా మూడ సంవత్సరాలు ఉందని ఆప్పుడు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని ఆయన టిఆర్‌ఎస్‌కు సవాల్ విసిరారు.

సిఎం కెసిఆర్‌ను జైల్లో పెడతామని బిజెపినాయకుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యానాలపట్ల మహేందర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కార్పొరేటర్ స్థాయి నాయకుడికి రాష్ట్ర నాయకత్వం ఇస్తే ఇలా ఉంటుందో బండిసంజయ్‌ని చూస్తే అర్థం అవుతుందన్నారు. ఆయన మాట్లాడే విధానమే కాదు కంఠంకూడా సరిగ్గాలేదని,సగం గుండుతో వికృతంగా ఉండే బండి సంజయ్‌ను చూస్తే జనం భయపడుతున్నారన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరగని అభివృద్ధిని సిఎం కెసిఆర్ తెలంగాణలో చేసి చూపించినందుకా జైళ్లో పెడతారని బండిసంజయ్‌ను మహేందర్ రెడ్డి ప్రశ్నించారు బండి సంజయ్ ఒక్కడే హిందువా,మేము హిందువులం కాదా? ప్రధాని మోడీ కేవలం హిందువులే ప్రధాన మంత్రా? అని మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. వికరాబాద్‌లో బిజెపిలో చేరిన చంద్రశేఖర్ సంస్కార హీనుడని ఆయనను టిఆర్‌ఎస్ పార్టీ గుర్తించదని శాసనసభ్యుడు మెతుకు ఆనంద్ చెప్పారు.

ఎవరిరక్తం హిందువుదో నాగార్జునసాగర్‌లో తేల్చుకుందామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యానాలను ఆనంద్ తప్పుబట్టారు.రక్తం మతానికో రంగు ఉంటుందాని బిజెపిని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్‌ని తరిమికొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని హెచ్చరించారు. బండి సంజ్‌య్ పౌరుషపదజాలం వాడితే జాగ్రతని హెచ్చరించారు. శాసనసభ్యుడు పైలెట్‌రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ప్రవేశపెఎట్టిన పథకాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని గుర్తు చేశారు. కెసిఆర్‌ను వ్యక్తిగతంగా దూషించే వారికి టిఆర్‌ఎస్ ఉగ్రరూపం చూపించాల్సి వస్తుందన్నారు.యువనేత కెటిఆర్ పనితీరును ప్రపంచదేశాలు ప్రశంసిస్తున్నాయన్నారు. సిఎం కెసిఆర్,మంత్రి కెటిఆర్ పై బిజెపి అసత్య ఆరోపణలు చేసినా, వ్యక్తిగతదూషణలు చేసినా టిఆర్‌ఎస్ ఉగ్రరూపం చూడాల్సి వస్తుందని ఆయన మందలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News