Home తాజా వార్తలు నాగం.. నోరు జాగ్రత్త: టిఆర్ఎస్

నాగం.. నోరు జాగ్రత్త: టిఆర్ఎస్

Karne-Prabhakar

మన తెలంగాణ/ హైదరాబాద్: టిఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కబర్దార్ అని టిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు టి.భానుప్రసాద్‌రావు, కర్నె ప్రభాకర్ హెచ్చరించారు. టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దంచుకో ,దోచుకో ,దాచుకో అని టిఆర్‌ఎస్‌పై నాగం చేసిన వ్యాఖ్యలు ఆయనకే వర్తిస్తాయని భాను ప్రసాద్ అన్నారు. ఉస్మానియా విద్యార్థులు నాగంను ఇప్పటికే దంచారని, ఆయనను చూస్తేనే ఎంత దోచుకున్నారో, దాచుకున్నారో తెలుస్తుందన్నారు.

రాజకీయ అస్థిరతలో ఉన్న నాగం తాను ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. కాళేశ్వరం కాంగ్రెస్ హాయంలోనే ప్రారంభమైందని అని ఆవగింజంత మెద డు ఉన్నవారెవ్వరూ మాట్లాడబోరని,ప్రాణహిత చేవెళ్ళ ను తెలంగాణను ఎండబెట్టేందుకే పాలకులు డిజైన్ చేశారని పేర్కొన్నారు. పాలమూ రు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.40 కోట్లు ఖర్చు చేయలేదంటూ నాగం ఆరోపణ చేస్తున్నారని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.3517 కోట్లు వెచ్చించిందన్నారు. ఆన్ పార్లమెంటరీ భాషను నాగం మాట్లాడితే జాగ్రత్త అని హెచ్చరించారు.

ఆయన అబద్ధాల రెడ్డి రె్ర్న సహజ ధోరణికి అనుగుణంగా నాగం గాంధీ భవన్ లో కాంగ్రెస్‌ను తిట్టి నాలుక కరుచుకున్నారని ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్ అన్నారు. ఉస్మానియా లో దేహశుద్ది చేసుకున్నట్టే కాంగ్రెస్ కార్యకర్తలతో గాంధీ భవన్ లో దేహశుద్ధి చేయించుకుంటారనే ఆందోళన కలుగుతోందన్నారు. ప్రజలు తన వ్యాఖ్యల పై దాడి చేస్తారనే నాగం అదనపు రక్షణ అడుగుతున్నట్లున్నారన్నారు. వివిధ పార్టీల మాజీ నేత ,ప్రస్తుత కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్‌రెడ్డికి ఆగం రెడ్డి ,బియ్యం రెడ్డి అని ఇప్పటికే బిరుదులు ఉన్నాయని, ఇప్పుడు అబద్ధాల రెడ్డి గా పేరు తెచ్చుకుంటున్నారన్నారు. ఉండగా వైఎస్‌ను తిట్టిన నాగం ఇపుడు ఆయన్ను పొగడడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్‌దైతే కాంగ్రెస్ నేతలే ఎందుకు కేసులు వేశారని నిలదీశారు.