Home తాజా వార్తలు వరంగల్‌ కార్పొరేషన్ లో టిఆర్‌ఎస్‌ ఆధిక్యం

వరంగల్‌ కార్పొరేషన్ లో టిఆర్‌ఎస్‌ ఆధిక్యం

TRS Leads In Warangal Corporation Elections Resultsవరంగల్‌ అర్బన్‌ : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.  అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఆదిక్యంలో దూసుకెళుతోంది. మొత్తం 66 డివిజన్లకు గాను 27 స్థానాల ఫలితాలు వచ్చాయి. టిఆర్‌ఎస్‌ 23 డివిజన్లలో, బిజెపి 3 డివిజన్లలో, కాంగ్రెస్‌ ఒక డివిజన్ లో విజయం సాధించాయి. వరంగల్‌ రాంపూర్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 66 డివిజన్లను 3 బ్లాకులుగా చేసి లెక్కిస్తున్నారు.  ఏ బ్లాకులో 32, బీలో 21, సీలో 13 డివిజన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 132 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.