Home తాజా వార్తలు బిజిగిరి దర్గాను సందర్శించిన మంత్రులు

బిజిగిరి దర్గాను సందర్శించిన మంత్రులు

TRS Ministers visiting Bijgir sharif dargah

 

మనతెలంగాణ/హైదరాబాద్ : బిజిగిరి షరీఫ్ హజ్రత్ సయ్యద్ ఇంకేషాఫ్ అలీ రహ్మతుల్లా హ్ అలై దర్గాను ఆదివారం సాయంత్రం మంత్రులు మహమ్మద్ మహమూద్ అలీ, హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, రైతు సమన్వయ సమితి ఛైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్‌ఎలు కోరుకంటి చందర్, నన్నపనేని నరేందర్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు, టిఆర్‌ఎస్ శ్రేణులు మంత్రులకు సాదర స్వాగతం పలికారు. ఈక్రమంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ మంత్రులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ రాజేశ్వరరావు, టిఆర్‌ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.