Thursday, April 18, 2024

కెసిఆర్ ఢిల్లీ వెళ్లింది ఓ సిఎంగానే: బాల్క సుమన్

- Advertisement -
- Advertisement -

Balka Suman Criticized bandi sanjay

హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తిగా సిఎం కెసిఆర్ ప్రధానిని కలవడంలో తప్పులేదని బాల్క సుమన్ అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర అంశాలపై కెసిఆర్ ప్రధానితో చర్చించారన్నారు. అయినా ప్రధానితో ముఖ్యమంత్రి భేటీ కావడం కొత్తేమీ కాదని ఆయన పేర్కొన్నారు. ఎంపిగా ఉన్న బండి సంజయ్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో మీలాంటి వాళ్లను ఎంతోమందిని చూశామని చెప్పారు. 40 ఏండ్ల రాజకీయ జీవితంలో సిఎం ఎన్నో పరిమాణామాలు చూశారు. రాష్ట్రానికి సంబంధించి చట్టాలపై బండి సంజయ్ అవగాహన పెంచుకోవాలని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. 14 ఏండ్లు ఉద్యమం నడిపి ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చింది సిఎం కెసిఆర్ అని గుర్తుచేశారు. సిఎం కెసిఆర్ గురించి మాట్లాడేటప్పుడు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హితువు పలికారు.

శిఖర సమానుడైన ఉద్యమ నాయకుడిపై బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకుడిపై ఆరోపణలు సరికాదన్నారు. బండి సంజయ్ లాంటోళ్లను ప్రజలే పట్టించుకోవడం లేదు.. ఇక మేమెందుకు పట్టంచుకోవడం అన్నారు. సిఎం కెసిఆర్ ప్రధానిని ఎప్పుడు కలిసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని బాల్క సూచించారు. బండి సంజయ్ కు రాజ్యంగం పట్ల కనీసం అవగాహన కూడా లేదన్నారు. స్థాయిలేని వ్యక్తులందరూ స్థాయిని మరిచి ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మేమూ తిట్టగలం.. కానీ మాకు సంస్కారం అడ్డువస్తుంది అందుకే ఆలోచిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో అప్పట్లో రాష్ట్ర సాధన కోసం ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు. కొత్త బిచ్చగాడు పొద్దుఎరగనట్లుగా బండి సంజయ్ ఎగిరెగిరి పడుతున్నారని వ్యంగ్యస్త్రాలు సందించారు. మా పార్టీ నాయకత్వం, కెసిఆర్ గురించి మాట్లాడే ముందు అవగహన పెంచుకొని మాట్లాడాలని.. బండి సంజయ్ తన పద్దతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెపుతారని హెచ్చరించారు.

TRS MLA Balka Suman Criticized bandi sanjay

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News