Home Default ఆర్ టిసి సమ్మె … మధ్యవర్తిత్వానికి ఓకే : కెకె

ఆర్ టిసి సమ్మె … మధ్యవర్తిత్వానికి ఓకే : కెకె

TRS MP KKహైదరాబాద్ : సిఎం కెసిఆర్ ఆదేశిస్తే టిఎస్ ఆర్ టిసిలో సమ్మె నివారణకు కార్మికులకు, ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టిఆర్ఎస్ ఎంపి కె.కేశవరావు తెలిపారు. సమ్మె విరమించి, చర్చలకు రావాలని కోరుతూ సోమవారం కెకె ఆర్ టిసి కార్మిక సంఘాల నేతలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం సమ్మెపై కెకె మరోసారి స్పందించారు. ఆర్ టిసి కార్మిక సంఘాల నేతలతో సంప్రదింపులు జరపాలన్న విషయంలో ఇప్పటి వరకు సిఎం కెసిఆర్ తనను పిలువలేదని కెకె పేర్కొన్నారు. ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆవేదన చెంది చర్చలకు రావాలని కార్మిక సంఘాల నేతలకు సూచించానని ఆయన తెలిపారు. ఆర్ టిసి కార్మికుల సమ్మె చేయిదాటిపోతుందన్న ఉద్దేశంతోనే తాను సోమవారం సమ్మెపై ప్రకటన చేశానని కెకె వెల్లడించారు. చర్చల కోసం కార్మిక సంఘాల నేతలు తనను ఇప్పటివరకు కలువలేదని ఆయన చెప్పారు. తనను కెసిఆర్ ఆదేశిస్తే , కార్మిక సంఘాల నేతలకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగేందుకు మధ్యవర్తిగా ఉంటానని కెకె పేర్కొన్నారు.

TRS MP KK Comments on TSRTC Strike