Friday, April 19, 2024

అన్నదాతల సమస్యలు పట్టించుకోరా?: నామ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అన్నదాతల సమస్యలు పట్టించుకోరా? అని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యపూరిత అలసత్వంపై టీఆర్ఎస్ ఎంపి నామ నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నామ నేతృత్వంలో టిఆర్ఎస్ ఎంపీలు రైతు సమస్యలపై లోక్ సభలో చర్చకు పట్టుబట్టారు. కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని ఖండిస్తూ లోక్ సభలో ఆందోళనకు దిగారు. తెలంగాణ రైతుల వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆకుప‌చ్చ కండువాలు ధ‌రించి.. ధాన్యానికి కనీస మద్దతు ధర చట్టం చేయాలని, వ‌రిధాన్యం సేక‌ర‌ణ‌పై జాతీయ విధానం ప్ర‌క‌టించాల‌ని నిలదీశారు. వరి కొనుగోళ్ల కోసం నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించాలని ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. సాగు చట్టాల రద్దుకు జరిగిన పోరాటంలో అమరులైన అన్నదాతలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో వెల్‌లోకి దూసుకువెళ్లిన టిఆర్ఎస్ ఎంపిలు నినాదాల‌తో హోరెత్తించారు. దీంతో స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.మంగళవారం ఉద‌యం టిఆర్ఎస్ పార్టీ ధాన్యం సేక‌ర‌ణ‌పై వాయిదా తీర్మానం ఇచ్చిన విష‌యం తెలిసిందే.

TRS MPs Protest on farmers issue in Parliament

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News