Friday, March 29, 2024

వ్య‌వ‌సాయ బిల్లుకు పూర్తిగా వ్య‌తిరేకం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

TRS MPs voting against the Agriculture Bill

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై సిఎం కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎంపిలను ఆదేశించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తిలాంటిదన్నారు. ఈ బిల్లు రైతులకు అన్యాయం చేసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లులు రైతులకు తీవ్ర అన్యాయం చేసేలా.. కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్ గద్దలు దేశమంతా విస్తరించేందుకు దోహదం చేస్తాయన్నారు. ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50శాతం పన్ను అమలులో ఉంది. పన్నును 15 శాతానికి తగ్గించి దిగుమతి చేసుకుంటే మన రైతుల పరిస్థితి ఏంటని కెసిఆర్ ప్రశ్నించారు. భారత్ ఆర్థిక సంక్షోభంలో ఉంటే కేంద్రం ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో చిన్నసన్నకారు రైతులే అధికంగా ఉన్నారని సిఎం గుర్తు చేశారు. కేంద్ర ప్రవేశ పెట్టిన బిల్లును తెలంగాణ సర్కార్  వ్యతిరేకిస్తుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

TRS MPs voting against the Agriculture Bill

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News