Friday, March 29, 2024

ప్రజాసేవలో ఉన్నది టిఆర్‌ఎస్ పార్టీనే

- Advertisement -
- Advertisement -

దౌల్తాబాద్: ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ప్రజా సేవలో ఉన్నది టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం దౌల్తాబాద్ ముబారస్‌పూర్ లో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు ఎండమావుల లాంటి వారని వారి వెంట పోతే వచ్చేదేమీ లేదని అన్నారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు భూమి శిస్తు వసూలు చేస్తే నేడు రైతులు పెట్టుబడి సాయం చేస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్ అని అన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు సంక్షేమ పథకాలు ఆపకుండా అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.

దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడా బీడీ పెన్షన్లు ఇవ్వడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే నేడు బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను దోపిడీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. వానాకాలం వస్తే ఉసిల్లు వచ్చినట్టు ఎన్నికలప్పుడు కాంగ్రెస్, బీజేపీ నాయకులు వచ్చిపోతారని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేసి ఉప ఎన్నికల్లో సోలిపేట సుజాతను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సునితా లకా్ష్మరెడ్డి, దౌల్తాబాద్ మండలాధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, , ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News