Saturday, April 20, 2024

భాగ్యనగరం ‘గులాబీ’ వనం

- Advertisement -
- Advertisement -
TRS party plenary meeting today at Hitex
టిఆర్‌ఎస్ 20ఏళ్ల పండుగ… హైటెక్స్‌లో నేడు పార్టీ ప్లీనరీ… ఆరున్నర వేల మంది పార్టీ ప్రతినిధుల కోసం అపూర్వంగా, అట్టహాసంగా ఏర్పాట్లు, రోజాలు పూసినట్టు అడుగడుగునా ఫ్లెక్సీలతో హైదరాబాద్ ముస్తాబు
ఉదయం 10గంటలకు సభ ప్రారంభం
ప్లీనరీ ఏరాట్లను పరిశీలించిన ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్. వెంట ఎంపి రంజిత్‌రెడ్డి, ఎంఎల్‌సి నవీన్ కుమార్, ఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టిఆర్‌ఎస్ నాయకులు రాఘవ, ఇతర సీనియర్ టిఆర్‌ఎస్ నాయకులు
నేడు టిఆర్ఎస్ ప్లీనరీ @20

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరికి సర్వం సిద్ధమైంది. ఈ పండుగ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ జరిగే హెచ్‌ఐసిసి(హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్) ప్రాంగణమంతా గులాబీమయం చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులు, ప్రధాన వీధులన్నీ గులాబీ జెండాలతో రెపరెపలాడుతున్నాయి. ఎక్కడా చూసిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ల ఫెక్సీలు, భారీ కటౌట్లు కనిపిస్తున్నాయి. ప్లీనరికి హాజరయ్యే ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతూ నగరం నలుమూలల పెద్దఎత్తున స్వాగత వేదికలు ఏర్పాట్లు చేశారు. భాగ్యనగరానికి సరికొత్త శోభను సంతరించుకునే విధంగా దగదగలాడే విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ప్లీనరీ వేడుకకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయి. మూడేళ్ల తర్వాత జరుగుతున్న ప్లీనరీ కావడంతో అదిరిపోయే స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రపంచ రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా 20 మీటర్ల వెడల్పు కాన్వాస్‌పై ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ కాంత్ రిసా… టిఆర్‌ఎస్ ప్రస్థానాన్ని వివరిస్తూ చిత్రాలు గీయనున్నారు. ఇక రాజుల కాలం నాటి కోటలను తలపించేలా భారీ ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశారు. 150 మీటర్ల వెడల్పు, 40 ఫీట్ల ఎత్తులో ఈ ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సభా వేదికకు ఇరువైపులా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాతిష్టాత్మకంగా నిర్మించిన భారీ ప్రాజెక్టులైన కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించిన కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుల నుంచి సాగునీరు పారుతున్నట్లుగా ప్రత్యేకంగా స్నోఫాల్‌ను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి చేరుకున్న వారికి ఆ ప్రాజెక్టుల నుంచి నిజంగానే నీరు పారుతోందా? అన్న భావన కలిగే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు సినిమా స్థాయిలో జరిగాయి.

అలాగే సభా వేదిక వద్ద వివిధ రకాల థీమ్లతో ఎల్‌ఈడీ ధగధగలు..కళ్లకు కట్టేలా వేలాది ఫొటోలతో ఉద్యమ సారథి సీఎం కేసీఆర్ జీవిత చరిత్ర. ఏడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ఫొటో ఎగ్జిబిషన్ను ప్లీనరీలో ఏర్పాటు చేశారు. ఈ పనులను 10 రోజుల ముందునుంచే ప్రారంభించడంతో నిర్ణిత వ్యవధిలోగా అన్ని హంగులను పూర్తి చేయగలిగారు. ఇదిలా ఉండగా మొదట్లో ప్రతినిధులను భారీగానే ఆహ్వానించాలకున్నారు. కానీ కోవిడ్ ఇబ్బందుల వల్ల ఆ సంఖ్యను ఆరున్నర వేలకు కుదించారు. మంత్రులు, ఎంపిలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్‌పి చైర్‌పర్సన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్‌పిటిసి సభ్యులు, కార్పొరేటర్ల వరకు ఆహ్వానించారు. ప్లీనరికి హాజరయ్యే ప్రతినిధులంతా అందరూ పింక్ షర్టులు, మహిళా నాయకులు గులాబీ రంగు కలర్ చీరలను ధరించి రావాలంటూ ఇప్పటికే పార్టీ అధిష్టానం సూచించింది. ఈ సమావేశం మొత్తం ఏడు తీర్మానాలను ఆమోదించనుంది.

ఉదయం 10 గంటలకు ప్లీనరీ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ముందుగా ప్రతినిధుల నమోదు కార్యక్రమం మొదలతుంది. ఈ ప్రక్రియను పూర్తిగా 10.45 గంటల లోపు పూర్తి చేస్తారు. అనంతరం 11 గంటలకు సభ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. పార్టీ అధ్యక్షుడిగా సిఎం కెసిఆర్ మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. తదనంతరం కెసిఆర్ ప్రసంగంతో ప్లీనరి సభ మొదలవుతుంది. ఇదిలా ఉండగా ఈ ప్లీనరి కోసం ప్రత్యేకంగా ఒక పాటు కూడా రూపొందించారు. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ రాసిన పాటల సిడిని రెండు రోజుల క్రితం మంత్రి కెటిఆర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ప్లీనరీలో పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కీలక ఘట్టాలతో పాటుదా సిఎం కెసిఆర్ జీవిత చరిత్రకు సంబంధించి ప్రత్యేకంగా ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కూడా ఛాయాచిత్రాలను ప్రదర్శించనున్నారు. కాగా సభకు హజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి పార్కింగ్ ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

దీని కోసం ఏకంగా 50 ఎకరాలు కేటాయించారు. ఇక ప్లీనరీకి హజరయ్యే ప్రతినిధులకు ఘుమఘుమలాడే వంటకాలను సిద్దం చేస్తున్నారు. సుమారు 31రకాల వంటకాలను వడ్డించనున్నారు. చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, పాయా సూప్, బోటి ఫ్రై, ఎగ్ మసాలా, రుమాలీ రోటీ, ఆలూ క్యాప్సికం, బగారా రైస్, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, దాల్ రైస్, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబార్, ఉలవచారు, క్రీమ్, పెరుగు, వంకాయ చట్నీ, జిలేబీ, డబల్ కా మీఠా, ఐస్ క్రీ లాంటి వంటకాలను వడ్డించనున్నారు. ఇందుకోసం 500 మంది వంటవాళ్లను, సహాయకులను నియమించారు. అలాగే ఒకేసారి 8 వేల మంది భోజనం చేసేలా వివిఐపిలు, ప్రజాప్రతినిధులు, మహిళల కోసం మూడు భోజన శాలలను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News