Home తాజా వార్తలు తెలంగాణకు శ్రీరామరక్ష టిఆర్ఎస్: హరీష్

తెలంగాణకు శ్రీరామరక్ష టిఆర్ఎస్: హరీష్

Harish rao

 

మెదక్: టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఎంఎల్‌ఎ హరీశ్ రావు కొనియాడారు. చిన్న శంకరంపేట్‌లో ఎంఎల్‌ఎలు హరీశ్ రావు, పద్మాదేవేందర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎరువుల కొరత, కరెంట్ కొరత ఉండేదని ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్ పాలనలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, పంట పెట్టుబడి సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. బిజెపి తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వలేదని హరీష్ మండిపడ్డారు.

 

TRS Party Protection to Telangana State: Harish Rao