Home తాజా వార్తలు మహారాష్ట్ర ఎన్నికల బరిలో టిఆర్ఎస్

మహారాష్ట్ర ఎన్నికల బరిలో టిఆర్ఎస్

CM KCRహైదరాబాద్: త్వరలో జరగబోయే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు తెలిపి, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.

తాము టిఆర్ఎస్ పార్టీ టికెట్లపై పోటీ చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. మంగళవారం నాందేడ్ జిల్లా రైతులు కెసిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ జిల్లాలోని సమస్యలను రైతులు కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయన్న రైతులు… తమ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ స్పందిస్తూ… దీనిపై తర్వలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతుల కోరికను మహారాష్ట్ర సర్కార్ మన్నిస్తుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో నాందేడ్ జిల్లాలోని 6 నియోజకవర్గాలను తెలంగాణలో కలపాలని అక్కడి నేతలు ఉద్యమించిన సంగతి తెలిసిందే.

 

TRS Party to contest in Maharashtra Elections