Saturday, April 20, 2024

తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్ ఖాయం: మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: మీడియాలో సంచలనాల కోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ పునరేకీకరణ అంశం పై మాట్లాడుతున్నారని, అసంబద్దమైన అంశం పై మాట్లాడటం తెలివి తక్కువ తనమే అవుతుందని మండిపడ్డారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి విభజన అంశం పై ఉండవల్లి వేసిన కేసు ఇప్పుడు అప్రస్తుతమన్నారు.

ఆనాడు బలవంతంగా కలిపితే అరవై ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ విభజన సాధించామని అన్నారు. విభజన జరిగితే ఏం ఆశించారో ఆ ఆశయాలకు తగ్గట్టుగా తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర కలవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. గుజరాత్‌లో సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే బిజేపి విజయం సాధించిందని, కాంగ్రెస్ దేశ ప్రజలను గాలికి వదిలేసిందని విమర్శించారు.

గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతుంటే రాహుల్ ఎక్కడో పాదయాత్ర చేస్తే ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలో బిజేపికి ఆప్ ప్రత్యామ్నాయంగా అవతరించడం వల్లే విజయం సాధించదన్నారు. తాజా ఫలితాలు దేశంలో మోడీకి ప్రత్యామ్నాయం కావాలని తెలియజేస్తుందని అందుకే దేశ ప్రజలు కేసీఆర్‌ను ప్రత్యామ్నాయంగా కోరుకుంటున్నారని అన్నారు. రాష్త్రంలో దర్యాప్తు సంస్థలన అడ్డు పెట్టుకుని అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం బిజేపి చేస్తుందని, అభివృద్ధిని అడ్డుకుని బిజేపి దేశ ద్రోహం చేస్తుందన్నారు.

సిబిఐ, ఈడి, ఐటి లతో దాడులు చేసి రాజకీయ పార్టీలను, వ్యాపారస్ధులను టార్గెట్ చేస్తుందని వ్యాపారాలను దెబ్బతీసి తద్వారా పేద ప్రజలకు ఉపాధి లేకుండా దుర్మార్గం చేస్తున్న బిజేపి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసిన తెలంగాణ ప్రజల మనసుల్లో నుండి టిఆర్‌ఎస్ ను వేరు చేయలేరని, ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మళ్లి తామే అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ ఛైర్మన్ వట్టె జానయ్య యాదవ్, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ గోపగాని వెంకటనారాయణ తదితరుల పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News