Home తాజా వార్తలు వరంగల్‌లో టిఆర్‌ఎస్‌కు 848 ఓట్లు… కాంగ్రెస్‌కు 27 ఓట్లు

వరంగల్‌లో టిఆర్‌ఎస్‌కు 848 ఓట్లు… కాంగ్రెస్‌కు 27 ఓట్లు

TRS

 

హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికలలో టిఆర్‌ఎస్ పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకుంది. నల్లగొండ ఎంఎల్‌సి స్థానంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి ఘన విజయం సాధించారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డి 640 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 433 ఓట్లు పడ్డాయి. దీంతో నల్లగొండలో టిఆర్ఎస్ పార్టీ 217 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. వరంగల్ ఎంఎల్‌సి స్థానంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి 825 ఓట్ల తేడాతో గెలుపొందారు. టిఆర్‌ఎస్‌కు 848 ఓట్లు, కాంగ్రెస్‌కు 23 ఓట్లు పడ్డాయి. రంగారెడ్డిలో టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి గెలుపొందారు. రంగారెడ్డిలో టిఆర్ఎస్ కు 510 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 266 ఓట్లు పడ్డాయి. పట్న మహేందర్ రెడ్డి 244 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

 

TRS Party Won in MLC Elections in Telalngana