Wednesday, April 24, 2024

టిఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు చేపట్టిన పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమాలు పూర్తయ్యాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ కమిటీలు, వార్డు, కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీల నిర్మాణం సంపూర్ణంగా ముగిసిందన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను పార్టీ చేపట్టనుందన్నారు. గతంలో సాధారణ ఎన్నికలు, కోవిడ్ నేపథ్యంలో పార్టీ ప్రతినిధుల సభ, ప్లీనరీ జరగలేదన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షున్ని ఎన్నుకునేందుకు 14 వేల మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు.

టిఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ నెల 17 న నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని,  22 దాకా నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని, 23 న స్క్రూటిని ఉంటుందని, 24 న నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చన కెటిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ లో కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. 25 న ప్రతినిధుల సభ, అదే రోజు పార్టీ అధ్యక్ష ఎన్నిక, హైటెక్స్ లో 25 న అధ్యక్షుడి ఆద్వర్యంలో ప్లీనరీ జరుగుతుంది. ఇందుకు 14 వేల మందిని ఆహ్వానిస్తున్నామని, 17 న టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల ఎమ్మెలిసీ, ఎంపిల సమావేశం తెలంగాణభవన్ లో జరుగుతుంది. రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తారని, పర్యవేక్షణ అధికారిగా పర్యదా కృష్ణమూర్తి వ్యవహరిస్తారు. అక్టోబర్ 27 న ద్విదశాబ్ది సభ సన్నాహక సమావేశం తెలంగాణ భవన్ లో జరుగుతుంది. నవంబర్ 15 న వరంగల్ లో పార్టీ విజయ గర్జన సభ వరంగల్ లో నిర్వహిస్తున్నా పేర్కొన్నారు.  జిల్లా అధ్యక్షుల ఎన్నిక తర్వాతే పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. తీర్మానాల కమిటీ చైర్మన్ గా మాజీ స్పీకర్ మధుసూదనాచారి వ్యవహరిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News