Home తాజా వార్తలు కార్యకర్తలకు టిఆర్‌ఎస్ అండ : హరీశ్‌రావు

కార్యకర్తలకు టిఆర్‌ఎస్ అండ : హరీశ్‌రావు

TRS Support to Party Workers : Harish Raoసిద్దిపేట: పార్టీకి చెందిన ప్రతిఒక్క కార్యకర్తకు టిఆర్‌ఎస్ అండగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండల పరిధిలోని అనంతసాగర్‌కు చెందిన పోతరాజు అఖిల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అఖిల్‌కు టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం ఉంది. పార్టీ కార్యకర్తగా ఉండి ప్రమాదంలో చనిపోతే రూ.2లక్షల బీమా వర్తించే విధంగా టిఆర్‌ఎస్ చీఫ్, సిఎం కెసిఆర్ ప్రమాద బీమా కల్పించారు. ఈ క్రమంలో అఖిల్‌కు పార్టీ సభ్యత్వం ఉండడంతో ఆదివారం ఉదయం ఆయన కుటుంబానికి మంత్రి హరీశ్‌రావు రూ.2లక్షల చెక్కును అందించారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణమని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 18 మంది కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను అందించినట్టు మంత్రి వెల్లడించారు.