Friday, March 29, 2024

నాగార్జునసాగర్ లో టిఆర్ఎస్ గెలుపు

- Advertisement -
- Advertisement -

TRS wins Nagarjuna Sagar bypoll

నల్లగొండ: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో టిఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపొందారు. నోముల భగత్ కు 19వేలకు పైగా మెజార్టీ సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఉన్నారు. ఈ ఎన్నికలో బిజెపి డిపాజిట్ కోల్పోయింది. ”నన్ను ఆశీర్వదించిన సాగర్ ప్రజలకు పాదాభివందనాలు, అందరి సహకారంతో సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తా” అని  నోముల భగత్ పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ వల్లే నా గెలుపు సాద్యమైందని భగత్ తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన టిఆర్ఎస్ శ్రేణులకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News