Home తాజా వార్తలు టిఆర్‌ఎస్‌కు మూడింట రెండొంతుల మెజార్టీ తథ్యం

టిఆర్‌ఎస్‌కు మూడింట రెండొంతుల మెజార్టీ తథ్యం

TRS with full support of people is form government again

మన తెలంగాణ / హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో మహా కూటమికి మహా ఓటమి తప్పదని, మూడింట రెండొంతుల మెజారిటీతో టిఆర్‌ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం తథ్యం అని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది టిఆర్‌ఎస్ పార్టీ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ ఇంగ్లీషు టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో కెటిఆర్ రాష్ట్రానికి సంబంధించినవి మాత్రమే కాకుండా జాతీయ స్థాయికి చెందిన అనేక రాజకీయ అంశాలను ప్రస్తావించారు. ప్రజల ఆశీర్వాదం పుష్కలంగా ఉన్నందునే ఏ కూటమి అవసరం తమ పార్టీకి లేదని, అందువల్లనే ఒంటరిగా పోటీ చేస్తున్నామని తెలిపారు. సిఎం కెసిఆర్‌కు తెలంగాణ ప్రజలు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు. మహాకూటమిని ప్రజలు తిరస్కరిస్తున్నారని, ఆ కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తారని వ్యాఖ్యానించారు. ప్రజల సంపూర్ణ మద్దతుతో టిఆర్‌ఎస్ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కెసిఆరే ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు.

జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అవసరం
ఈ దేశాన్ని పాలించిన పార్టీలన్నీ ప్రజల మౌలిక అవసరాలను తీర్చడంలో విఫలమయ్యాయని, ప్రాంతీయ పార్టీల కూటమి అవసరం తప్పనిసరిగా ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఏర్పాటుచేస్తున్న ‘మహా ఘట్‌బంధన్’ వాస్తవానికి ‘మహా ఘటియా బంధన్’ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి తరుణంలో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తికి టిఆర్‌ఎస్ ఆజ్యం పోస్తుందని, బలమైన భూమిక పోషిస్తుందని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ సారధ్యంలో టిఆర్‌ఎస్ నేతృత్వంలోనే ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడుతుందని, సమీప భవిష్యత్తులో స్పష్టమైన పాత్రను పోషిస్తుందన్నారు.

TRS with full support of people is form government again

Telangana Latest News