Home జాతీయ వార్తలు ఫేస్‌బుక్‌కు ధీటుగా ‘ట్రూ ఇండియన్’

ఫేస్‌బుక్‌కు ధీటుగా ‘ట్రూ ఇండియన్’

TRUE INDIAN SITE LIKE FBన్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌కు పోటీగా భారత్‌లో మరో సామాజిక మీడియా అనుసంధానంగా ఏర్పాటు చేయనున్నట్లు ట్రూ ఇండియన్ అనే సంస్థ సోమవారం ప్రకటించింది. ‘ట్రూ ఇండియన్’ పేరుతో త్వరలో నెటిజన్లకు అందుబాటులోకి రానున్న ఈ సామాజిక మీడియా సైట్‌ను బిహార్ ఆర్థిక మంత్రి జగ్గంత్ మిశ్రా తనయుడు మనీష్ మిశ్ర ఆధ్వర్యంలో ప్రారంభంకానుంది. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబంగా ‘ట్రూ ఇండియన్’ ఉండనుందని అన్నారు ‘ఫ్రెండ్స్ ఫర్ లైఫ్’ అనే దాతృత్వ సంస్థ. ‘ఫేస్‌బుక్’ వాటాదారులను, వ్యవస్థాపకులకు కేవలం లాభాలు సంపాదించిపెట్టేందుకే పనిచేస్తుందని ఆరోపించింది. భారతదేశాన్ని దోచుకున్న ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’తో పోల్చింది. అయితే ‘ఫేస్‌బుక్’ సామాజిక మీడియా అయిన ‘ఆర్కుట్’ను ఎలా పక్కకునెట్టిందో అలానే మరో ఐదేళ్లలో ఫేస్‌బుక్‌ను ట్రూ ఇండియన్ పక్కకు నెడుతోందని ఆ సంస్థ పేర్కొంది.