Home ఎడిటోరియల్ ట్రంప్ దెబ్బతో మారుతున్న కూటములు

ట్రంప్ దెబ్బతో మారుతున్న కూటములు

Trump allies push White House to consider regime change in Tehran

‘బాక్సింగ్ ది కంపాస్’ సముద్ర ప్రయాణ మార్గం నిర్దేశనకై అయస్కాంత వృత్తలేఖినిపై బిందువులు గుర్తించే పాత సముద్ర యాత్రికుల పదం. ఈ రోజుల్లో వాషింగ్టన్ నుంచి వీస్తున్న క్రమ రహిత గాలులతో ఆసియా, మధ్యప్రాచ్యంలో అంతటా దేశాలు కంపాస్‌ను సరిచూస్తూ పాత శత్రువులు, పాత అలయెన్స్‌లు గూర్చి పునరాలోచన చేస్తున్నారు.

భారత్, పాకిస్థాన్‌లు గత అర్ధశతాబ్దంలో మూడు యుద్ధాలు చేసుకున్నాయి. ఇప్పుడు రెంటికీ అణ్వాయుధాలున్నా యి. అయితే రెండు దేశాలు ప్రస్తుతం భద్రత, వాణిజ్య సంస్థ అయిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ)లో చైనా, రష్యా అనేక మధ్య ఆసియా దేశాలతోపాటు సభ్యులుగా ఉన్నాయి. పాకిస్థాన్‌లో ఇటీవల ఎన్నికల అనంతర ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ, వివాదాల పరిష్కారానికీ, ఆఫ్ఘనిస్థాన్‌లో “శాంతి సుస్థిరతకై” భారత్‌తో నిరంతరాయ సంభాషణను కోరారు. పాకిస్థాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా యుద్ధాన్ని, ముఖ్యంగా పాకిస్థాన్‌లో చొరబాటుదారులను చంపటానికై అమెరికా డ్రోన్‌లు ఉపయోగించటాన్ని విమర్శించిన వ్యక్తి.

ఆష్ఘనిస్థాన్‌లో 17ఏళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని అంతం చేసేందుకై సెప్టెంబర్ 4న మాస్కోలో శాంతి చర్చలకు రష్యా ఆహ్వానాన్ని తాలిబన్ అంగీకరించింది. మూడు దశాబ్దాల క్రితం తాలిబన్‌లు అమెరికా తయారీ స్టింగర్ మిస్సిలీలతో రష్యా హెలికాప్టర్‌లను కూల్చేవారు.

వాణిజ్యం పెంపొందించుకోవాలని, సిరియాలో యుద్ధం ముగించేందుకై రాజకీయ పరిష్కారం కనుగొనాలని టర్కీ, రష్యా అంగీకరించాయి. రష్యా, ఇరాన్‌లపై అమెరికా ఆంక్షలను పట్టించుకోరాదని కూడా టర్కీ నిర్ణయించింది. మూడేళ్ల క్రితం పరిస్థితి టర్కీ యుద్ధ విమానాలు రష్యా బాంబర్‌ను కూల్చాయి. అంకారా (టర్కీ) ఇరాన్‌ను ఖండించింది. బషర్ అల్ అస్సాద్ (సిరియా) ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నిస్తున్న ఇస్లామిక్ తీవ్రవాదులకు టర్కీ ఆయుధాలిచ్చింది, ఆర్థికంగా తోడ్పడింది.
దక్షిణ చైనా సముద్రంలో చైనా, అనేక ఆగ్నేయాసియా దేశాల మధ్య (వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్, మలేసియా, బ్రూనీ వగైరా) అనేక సంవత్సరాలుగా ఉద్రిక్తతల తదుపరి ఆగస్టు 2న చైనా, ఆగ్నేయాసియా దేశాల అసోసియేషన్ (ఏసియాన్) మధ్య చర్చల్లో పురోగతిని బీజింగ్ ప్రకటించింది. అనేక సంవత్సరాలపాటు వైరం, నౌకలు ఎదురుబొదురు తారసిల్లిన తదుపరి చైనా, ఏసియాన్ సంయుక్తంగా ఆగస్టు 2,3 తేదీల్లో కంప్యూటర్ నావల్ గేమ్స్‌నిర్వహించాయి. ఏసియాన్ దేశాలతో సహకార ఆయిల్, గ్యాస్ అన్వేషణను చైనా ప్రతిపాదించింది.

దక్షిణ చైనా సముద్రంలో, హిందూ మహాసముద్రంలో చైనాను సవాలు చేసే నిమిత్తం అమెరికా జార్జి డబ్లుబుష్ ప్రభుత్వ కాలం నుంచీ జపాన్, ఆస్ట్రేలియాలతోపాటు చతుర్పక్ష భద్రత సంభాషణ (“క్వాడ్‌”) అనే అలయెన్స్‌లోకి భారత్‌ను రాబట్టటానికి ప్రయత్నిస్తూ వచ్చింది. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని (ఎన్‌పిటి) భారత్ ఉల్లంఘించటాన్ని అమెరికా పట్టించుకోలేదు. భారత్‌కు ఆయుధాల విక్రయంపై నిషేధం ఎత్తివేసింది. హిందూ మహాసముద్రంలో భారత్ ఆందోళనలను ప్రతిబింబించే విధంగా అమెరికా తన పసిఫిక్ కమాండ్ పేరును “ఇండో పసిఫిక్ కమాండ్‌” గా మార్చింది. అమెరికా ప్రస్తుతం భారత్ యుద్ధ విమాన పైలెట్లకు శిక్షణ ఇస్తోంది. ఈ వేసవిలో వ్యూహాత్మకంగా కీలకమైన మలక్కా జలసంధిలో జపాన్, అమెరికాతో కలిసి భారత్ సంయుక్త నౌకా విన్యాసాలు (మలబార్ 18) జరిపింది.

అయితే ఏప్రిల్‌లో ఉహాన్‌లో చైనా అధ్యక్షుడు క్సి జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం తదుపరి క్వాడ్‌పట్ల న్యూఢిల్లీ ఉత్సాహం తగ్గినట్లు కనిపిస్తున్నది. మలబార్ యుద్ధ క్రీడలో ఆస్ట్రేలియా చేరటాన్ని న్యూఢిల్లీ వీటో చేసింది.
జూన్‌లో సింగపూర్‌లో సాంగ్రి లా సంభాషణలో మోడీ ప్రసంగిస్తూ, “ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని వ్యూహంగా లేదా పరమిత సభ్యుల క్లబ్‌గా భారత్ చూడటం లేదు” అన్నారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రవర్తన తీరును విమర్శించలేదు. డోక్లాం సరిహద్దు ప్రాంతంలో భారత్, చైనా సైనికులు తోపులాటలు, పిడిగుద్దులతో జగడానికి దిగినా, చైనా సైన్యం గూర్చి మోడీ మౌనం ఆశ్చర్యకరం.

చైనా, భారత్ ఈమధ్య సైనిక హాట్‌లైన్ ఏర్పాటు చేసుకున్నాయి. భారత వస్తువులపై బీజింగ్ సుంకాలు తగ్గించింది. షాంఘై సమావేశాల సందర్భంలో మోడీ, క్సీలు ఆఫ్ఘనిస్థాన్‌లో యుద్ధం అంతం చేయటంలో సహకారం గూర్చి చర్చించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తీవ్రవాదం తమ సరిహద్దులు దాటివచ్చునని భారత్, పాకిస్థాన్, రష్యా సందేహిస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) పెరుగుదలకు నిరోధకంగా తాలిబన్‌ను పటిష్టం చేయాలని ప్రయత్నిస్తున్నారు.

దీర్ఘకాలంగా వాయిదాపడుతూ వచ్చిన ఇరాన్ పాకిస్థాన్ గ్యాస్ పైపులైన్ నిర్మాణం మళ్లీ ముందుకు వచ్చింది. ఇది అంతిమంగా భారత్ భూభాగాన్ని చేరుకోవాలి. షాంఘై సహకార సంస్థ “క్వింగ్ డావో డిక్లరేషన్‌పై భారత్ సంతకం చేసింది. “ఆర్థిక ప్రపంచీకరణ ఏకపక్ష స్వీయ రక్షణ వాద విధానాల ప్రతిఘటనను ఎదుర్కొంటున్నది” అని ఆ ప్రకటన పేర్కొన్నది. ఇది ట్రంప్ ప్రభుత్వ విధానాలపై నేరుగా ఎక్కుపెట్టబడిన విమర్శ.

ఇరాన్‌పై అమెరికా ఆంక్షల్లో తాము చేరబోమని, టెహరాన్ నుంచి గ్యాస్, ఆయిలు కొనసాగిస్తామని మోడీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రష్యా ఆయుధ పరిశ్రమతో వ్యాపారం చేస్తున్న ఏ దేశంపైనైనా ఆంక్షలు విధిస్తామన్న అమెరికా హెచ్చరికలను భారత్ పట్టించుకోదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

పశ్చిమ పసిఫిక్‌లో ఎవరితో కలిసి పనిచేయాలనే విషయమై అమెరికాకు గట్టి మిత్రపక్షమైన ఆస్ట్రేలియా కూడా పునరాలోచిస్తోంది. ఆస్ట్రేలియా ప్రస్తుతం అమెరికా మెరైన్‌లకు ఆతిథ్యమిస్తోంది, పిన్‌గాప్‌లో అతిపెద్ద అమెరికా సమాచార సేకరణ కేంద్రం పని చేస్తోంది. అయితే కాన్‌బెర్రాకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. చైనా విద్యార్థులు, టూరిస్టులు ఆస్ట్రేలియాకు ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉన్నారు. ఆస్ట్రేలియా రాజకీయాలపై చైనా ప్రభావం గూర్చి ఆస్ట్రేలియాలో ఇప్పుడు వాదోపవాదాలు జరుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వ నిలకడలేని విధానాల కారణంగా ఆస్ట్రేలియా అమెరికాతో ఎంత సన్నిహితంగా మెలగాలన్న అంశంపై దాని విదేశాంగ మంత్రిత్వ శాఖలో భిన్నాభిప్రాయాలున్నాయి. “ఆధిపత్య శక్తిగా ఉండటంలో అమెరికా విఫలమవుతుండటమేగాక, గణనీయమైన వ్యూహాత్మక పాత్రను నిలుపుకోవటంలో కూడా విఫలమవుతున్నది” అంటున్నారు రక్షణ వ్యూహకర్త హూజ్ వైట్.

బృహత్తరమైన చైనా “ఒక బెల్ట్, ఒక రోడ్’ పథకాన్ని ఆమోదించని ఈ ప్రాంత దేశాల్లో భారత్ ఉంది. అపారమైన వాణిజ్య నెట్‌వర్క్‌లోకి ఏసియాన్, దక్షిణాసియా, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యం, యూరప్‌ను కలిపే మౌలిక వసతుల నిర్మాణాన్ని ఈ పథకం ఉద్దేశించింది. పాకిస్థాన్, భారత్‌లు కశ్మీర్‌పై విభేదిస్తాయి. కాని ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితిని పరిష్కరించే దౌత్య ప్రయత్నం చిక్కుముడిని విప్పాలనుకుంటున్నాయి. రష్యా శాంతి చర్చల ఆహ్వానాన్ని తాలిబన్ అంగీకరించగా అమెరికా తిరస్కరించింది. కాబూల్‌లోని ప్రభుత్వం కూడా అంగీకరించలేదు. అయితే శాంతి చర్చల్లో చేరాలని ఆఫ్ఘన్ ప్రభుత్వంపై భారత్ ఒత్తిడి తెస్తే ఆ వైఖరి మారుతుంది. కాబూల్‌తో చర్చలకు తాలిబన్ అంగీకరించటమే పెద్ద పురోగతి. ఈ దీర్ఘకాల, భయానక యుద్ధం అంతం కావాలని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

టర్కీ, రష్యా మధ్య ఇప్పటికీ పరస్పర విశ్వాసం లేదు. ఇరాన్ ప్రస్తుతం మాస్కో, అంకారా పక్షంలో ఉన్నప్పటికీ వాటి మధ్య సాన్నిహిత్యం లేదు. అయితే తమ ఆర్థిక వ్యవస్థ గొంతునులిమే ట్రంప్ ఆంక్షలను నిరోధించటానికై ఇరాన్‌కు మార్గాంతరం కావాలి. అంటే టర్కీ, రష్యాలపట్ల చారిత్రకంగా ఉన్న అనుమానాలను విడనాడాల్సి ఉంటుంది. అమెరికా ఆంక్షలను శిరసావహించబోమని రెండు దేశాలు చెబుతున్నాయి. కాగా రష్యన్‌లు అంతర్జాతీయ బ్యాంకింగ్‌లో డాలర్‌ను ఉపయోగించటాన్ని దాటవేసే పరపతి వ్యవస్థ గూర్చి ఆలోచిస్తున్నారు.

యూరోపియన్‌లు ఇప్పటికే అమెరికా ఆంక్షల కింద నలుగుతున్నారు. ఆట ఆడుతున్నది అమెరికా, యూరోపియన్ యూనియన్ మాత్రమే కాదు. షాంఘై సహకార సంస్థ, ఏసియాన్, బ్రిక్స్ దేశాలు, లాటిన్ అమెరికా మెర్కోసర్ అధికారం, పలుకుపడి అనే స్వతంత్ర ధృవాలు సృష్టిస్తున్నాయి. అమెరికాకు అపారమైన సైనిక శక్తి ఉన్నప్పటికీ యుద్ధం, వాణిజ్య వంటి విషయాల్లో ఇతర దేశాలు ఏమి నిర్ణయాలు తీసుకోవాలో ఆదేశించగల స్థితి దానికి ఇకెంతమాత్రం లేదు.
వాషింగ్టన్ నుంచి ఏ దిశగా గాలులు వీస్తాయో ఏ మాత్రం స్పష్టత లేదు. కాని తమ సొంత మార్గం ఎంచుకునే దేశాల సంఖ్య పెరుగుతున్నది. (ఐసిఎ)

                                                                                                                                                         – కోన్ హల్లీనన్