Thursday, April 18, 2024

కరచాలనం చేయని ట్రంప్.. ప్రసంగం కాపీలు చించేసిన స్పీకర్

- Advertisement -
- Advertisement -

Trump

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పీకర్ నాన్సీ పెలోసి నడుమ విభేదాలు మరోసారి స్పష్టంగా బయటపడ్డాయి. అమెరికా జాతీయ కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ట్రంప్ సెనేట్‌కు వచ్చారు. అధ్యక్షుడి గౌరవార్థం స్పీకర్ నాన్సీ ఆయనకు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు తన కుర్చీలోంచి లేచి ముందు కు కదిలి చేయి చాచారు. దానికి ట్రంప్ పెదవి విరుస్తూ నిరాకరిస్తూ ప్రసంగించేందుకు ముందుకు కదిలారు. ఉభయ సభలను ఉద్దేశిస్తూ ట్రంప్ ప్రసంగిస్తున్నారు. అధ్యక్షుడి ప్రసంగం చివరలో ఉండగా నాన్సీ ప్రతీకార చర్యకు దిగారు.

ఆమె తన చేతిలో ఉన్న అధ్యక్షుడి ప్రసంగం కాపీని రెండు ముక్కలుగా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్య అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా కా లంగా వీరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ట్రంప్‌పై అభిశంసనను సెనేట్‌లో చేపట్టింది స్పీకర్ నాన్సీనే కావడంతో ఆమెతో చేతులు కలపడానికి ట్రంప్ నిరాకరించినట్లు తెలుస్తోంది. వీరివురు ఎదురుపడిన సం దర్భాల్లోనూ కనీస పలకరింపులు కూడా ఉండటం లేదు. అభిశంసనకు కారణమైన స్పీకర్‌తో గత కొద్ది నెలలుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూరంగా ఉంటున్నారు.

Trump appeared to ignore Nancy Pelosi handshake

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News