Tuesday, April 23, 2024

ఓడను… ఓడినా తేలిగ్గా అధికారం అప్పగించను

- Advertisement -
- Advertisement -

Trump comments over mail voting

 

మెయిల్ ఓటింగ్‌పై ట్రంప్ షాక్

న్యూయార్క్ : అమెరికాలో నవంబర్ 3 దేశాధ్యక్ష ఎన్నికల దశలో ప్రెసిడెంట్ ట్రంప్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తేదీ తరువాత అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడం గురించి తాను ఇప్పటికిప్పుడు ఎటువంటి హామీ ఇవ్వదల్చుకోలేదని గురువారం స్పష్టం చేశారు. ఎన్నికలలో ప్రతిపక్ష డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ చేతిలో ఓటమి పాలయితే అధికారం సజావుగా అప్పగిస్తారా? మొండికేస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా దీనికి ముందుగానే జవాబు సిద్ధం చేసుకున్నట్లుగా ఈ రిపబ్లికన్ పోటీదారు జోరుగా స్పందించారు. ఏమో అధికారబదిలీ అంత ఈజీ అన్పించడం లేదని, చివరికి ఇది సుప్రీంకోర్టుకు వెళ్లుతుందని తాను భావిస్తున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. పోస్టల్ ఓటింగ్‌పై తనకు ఇప్పటికీ సవాలక్ష సందేహాలు ఉన్నాయని, ఈ పద్దతిలోనే సాగే ఎన్నికల్లో ఓటమి పాలయితే వెంటనే అధికారాన్ని పూలలో పెట్టి అప్పగించాల్సిన పనిలేదన్నారు.

దేశంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంటున్న దశలోనే ట్రంప్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. అమెరికాలో మాస్క్‌లు ఇతరత్రా కట్టుబాట్లు సరిగ్గా అమలులో లేకపోవడంతో కరోనా మహమ్మారి ఇప్పటికీ పలు ప్రాంతాలలో విజృంభిస్తూనే ఉంది. దేశంలో ఇప్పటికే కరోనా వైరస్ సోకి రెండు లక్షల మందికి పైగా మృతి చెందారు. ఈ దశలో నవంబర్ ఎన్నికలలో మెయిల్ ఇన్ ఓటింగ్ లేదా పోస్టల్ బ్యాలెట్ పద్థతిని పలు రాష్ట్రాలు ప్రోత్సహిస్తున్నాయి. అసలే ఎన్నికలు, ఓటింగ్ ప్రక్రియలకు దూరంగా ఉండే అమెరికా సగటు పౌరులు ప్రస్తుత తరుణంలో పోస్టల్ బ్యాలెట్ పద్థతిని ఎంచుకోవడానికి సిద్ధపడుతున్నారు. నేరుగా బ్యాలెట్ పద్థతి ఓటింగ్‌తో పోలిస్తే ఈ పరోక్ష పద్ధతి ఓటింగ్ తన విజయావకాశాలను దెబ్బతీస్తుందని ట్రంప్ తరచూ చెపుతూ వస్తున్నారు. ఇప్పటికైతే పలు సార్లు తన అభిప్రాయం చెపుతూ వచ్చానని, అయితే ఏంజరుగుతుందనే దానిపై ఇప్పుడే స్పష్టంగా స్పందించడం కుదరదని తెలిపారు. వైట్‌హౌస్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలోనే ట్రంప్ ఏకంగా ఎన్నికల ఓటింగ్, ఫలితాల తరువాత అధికార బదిలీపై హై ఓల్టెజ్ సంచలన వ్యాఖ్యలకు దిగారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News