Friday, March 29, 2024

బలపడిన బంధం

- Advertisement -
- Advertisement -

modi trump

 

మా భారత పర్యటన అత్యంత ఫలవంతమైనదిగా చరిత్రలో మిగిలిపోతుంది. మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం ఖరారైంది. అపాచీ, ఎంహెచ్60 రోమియో వంటి అత్యధునాతన రక్షణ హెలికాప్టర్లను, సైనిక పరికరాలను భారత్‌కు అందజేయనున్నాం. 5జి సాంకేతికత, ఇండోపసిఫిక్ ప్రాంతంలో భద్రతా పరమైన అంశాలను ప్రధాని మోడీతో చర్చించాను. భారత్‌లో లభించిన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మరువలేము. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాలు కలిసి పని చేస్తాయి. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు ఆ దేశంతో కలిసి అమెరికా కృషి చేస్తోంది.

                                                                                                ట్రంప్

భారత్‌అమెరికా సంబంధాలు కేవలం రెండు దేశాల మధ్యే కాదు, ప్రజల మధ్య, ప్రజల కోసం, ప్రజలు కేంద్రంగా కొనసాగుతాయి. ఈ రెండు దేశాల మైత్రి 21వ శతాబ్దంలోనే కీలక ఘట్టం. ట్రంప్ తాజా పర్యటన ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసింది. అత్యాధునిక రక్షణ, భద్రత, టెక్నాలజీపై చర్చించాము. అత్యాధునిక రక్షణ ఉత్పత్తి సంస్థలు భారత్‌కు వస్తున్నాయి. భారత రక్షణ వ్యవస్థలో ఈ సంస్థలు భాగస్వామ్యం వహిస్తాయి. సైనిక శిక్షణలో పరస్పరం సహకరించుకుంటున్నాం. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల ఆర్థిక మంత్రుల మధ్య ఒక అవగాన కుదిరింది. అమెరికాతో
ఓ భారీ ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నాం.

                                                                                            ప్రధాని నరేంద్ర మోడీ

3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం

మరి 3 ఎంఒయులు, వాణిజ్య ఒప్పందం చర్చల్లో పురోగతి

న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో కీలక ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ చర్చల్లో 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందంతో పాటుగా మరో మూడు కీలక అవగాహన ఒప్పందాల (ఎంఓయు)పై ఇరువురు నేతల సమక్షంలో సంతకాలు చేశారు. వీటిలో భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, అమెరికాకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెన్ మధ్య ‘ మానసిక ఆరోగ్యంపై సహకారానికి సంబంధించి కుదిరిన ఒప్పందం ఒకటి. అలాగే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (భారత్),ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (అమెరికా) మధ్య‘ సేఫ్టీ ఆఫ్ మెడికల్ ప్రాడక్ట్‌పైన, ఇంధన రంగంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అమెరికాకు చెందిన ఎగ్జాన్ మొబిల్ మధ్య మరి రెండు ఒప్పందాలు కుదిరాయి.

చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో క లిసి ట్రంప్ విలేఖరుల సమావేశంలో మాట్లాడా రు. తమ భారత పర్యటన అత్యంత ఫలవంతమైనదిగా మిగిలిపోతుందని ట్రంప్ అన్నారు. మూ డు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం ఖరారైనట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా అపాజీ, ఎంహెచ్60 రోమియో వంటి అత్యధునాతన రక్షణ హెలికాప్టర్లను, అత్యధునాతన సైనిక పరికరాలను భారత్‌కు అందజేయనున్నామని ఆయన ప్రకటించారు. దీంతో అమెరికా, భారత్‌ల మధ్యరక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. 5జి సాంకేతికత, ఇండోపసిఫిక్ ప్రాంతంలో భద్రతా పరమైన అంశాలను ప్రధాని మోడీతో చర్చించినట్లు ఆయన చెప్పారు. ఈ పర్యటన తమకు ఎంతో ప్రత్యేకమైనదని, భారత్‌లో తమకు లభించిన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మరువలేమన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాలు కలిసి పని చేస్తాయని స్పష్టం చేశారు.

పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు ఆ దేశంతో కలిసి అమెరికా కృషి చేస్తోందన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఉగ్రవాద నిరోధం వంటి అంశాల్లో ఆస్ట్రేలియా, జపాన్‌లతోనూ ఇరు దేశాల సహకారం కొనసాగుతుందన్నారు. భారత్, అమెరికాల మధ్య అనేక సారూప్యతులన్నాయని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడం, రాజ్యాంగ బద్ధంగా తమ పౌరులకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కల్పించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాపతగా అన్ని దేశాల్లో మెరుగైన మౌలిక ప్రాజెక్టులను చేపట్టడానికి బ్లూడాట్ నెట్‌వర్క్‌పై ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలతో కలిసి పని చేస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశారు.

వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలు సాగుతున్నాయి
సమగ్ర వాణిజ్య ఒప్పందం దిశగా ఇరు దేశాలు జరుపుతున్న చర్చల్లో ఎంతో పురోగతి సాధించామన్నారు. ‘ఈ విషయంలో మా బృందాలు అద్భుతమమైన పురోగతి సాధించాయి.త్వరలోనే ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే ఒక గొప్ప ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నా’ అని ట్రంప్ చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన నాటినుంచి భారత్‌కు అమెరికా ఎగుమతులు 60 శాతం పెరిగాయని చెప్పారు. నాణ్యమైన ఇంధన ఉత్పత్తుల ఎగుమతులు 500 శాతం పెరిగాయన్నారు.

ఈ బంధం ప్రజలది: మోడీ
అంతకుముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా ట్రంప్ భారత్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. ట్రంప్ కుటుంబానికి, అమెరికా ప్రతినిధుల బృందానికి మరోసారి మోదీ హార్దిక స్వాగతం పలికారు. భారత్- అమెరికా మైత్రి 21వ శతాబ్దంలోనే కీలక ఘట్టమని ఆయన అభివర్ణించారు. ట్రంప్ తాజా పర్యటన ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసిందన్నారు. తమ సమావేశాల్లో అత్యాధునిక రక్షణ, భద్రత, టెక్నాలజీపై చర్చించామని మోదీ పేర్కొన్నారు. అత్యాధునిక రక్షణ ఉత్పత్తి సంస్థలు భారత్‌కు వస్తున్నాయని తెలిపారు. భారత రక్షణ వ్యవస్థలో ఈ సంస్థలు భాగస్వామ్యమవుతున్నాయని అన్నారు. సైనిక శిక్షణలో ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకుంటున్నాయని గుర్తు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల ఆర్థిక మంత్రుల మధ్య ఒక అవగాన కుదిరిందని చెప్పారు.

అమెరికాతో ఓ భారీ ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నామని ప్రధాని వెల్లడించారు. అమెరికాకు ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులు ఇరు దేశాల మధ్య మెరుగైన సంబంధాలలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అంతర్గత భద్రతపై ఒకరికొకరు సహకరించుకుంటున్నామని, మాదక ద్రవ్యాలు, నార్కో టెర్రరిజంపై ఉమ్మడిగా ఉక్కుపాదం మోపాలని నిర్ణయించామని మోడీ అన్నారు. మానవ అక్రమ రవాణాపై రెండు దేశాలు ఉమ్మడిగా పోరాటం చేస్తాయన్నారు. రెండుదేశాల మధ్య గత కొన్నేళ్లలో 70 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగిందని వివరించారు. దీనిలో ట్రంప్ పాత్ర కూడా ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఇది మరింత పెరుగుతుందన్నారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారికి వ్యతిరేకంగా రెండు దేశాలు పోరాటం చేస్తాయని మోడీ పేర్కొన్నారు. ఆర్థిక సంబంధాల్లో పారదర్శక వాణిజ్యానికి కట్టుబడి ఉన్నామన్నారు. ‘ట్రంప్‌ను నేను ఒకటి కోరా..మన వృత్తి నిపుణుల సామాజిక భద్రత, ఇతర అంశాలపై చర్చలు కొనసాగాలని కోరా. ఈ సందర్భంగా ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నా’ అన్నారు.

Trump held key bilateral talks with Modi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News