Friday, March 29, 2024

సెనేట్ విచారణకు ట్రంప్ అభిశంసన కేసు

- Advertisement -
- Advertisement -

Trump impeachment case for Senate hearing

 

ఫిబ్రవరి 8 నుంచి విచారణ ప్రారంభం

వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై అభిశంసన తీర్మానం కేసుకు సంబంధించి చారిత్రక విచారణ ప్రారంభించాలని కోరుతూ డెమొక్రాట్లు సోమవారం బాగా పొద్దు పోయిన తరువాత సెనేట్ కు పంపించారు. అమెరికా చరిత్రలో అధ్యక్షునిపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టడం, దీనిపై విచారణకు సిద్ధం కావడం ఇదే మొదటిసారి. అయితే రిపబ్లికన్లు మాత్రం ఈ ్త విచారణ ప్రయత్నాలను నీరు కార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ట్రంప్‌కు తన పార్టీపై ఉన్న పట్టును తెలుపుతోంది. తిరుగుబాటుకు ప్రేరేపించారన్న ఆరోపణపై తొమ్మిది మంది సభ్యులు ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రతిపాదించారు.

అయితే జనవరి 6 నుంచి రిపబ్లికన్లు ఈ ప్రయత్నాలను అడ్డుకొంటున్నారు. ఇంతేకాకుండా అభిశంసనపై విచారణకు సిద్ధం కావడంలో చట్టబద్ధతను ప్రశ్నిస్తున్నారు. చట్టపరమైన వాదనల చిక్కులను కల్పిస్తున్నారు. మాజీలపై కాంగ్రెస్ అభిశంసన విచారణ చేపడితే తరువాత ఏమిటి? తిరిగి మనం వెనక్కు వెళ్తామా? ఒబామా అధ్యక్షుడుగా ప్రయత్నిస్తామా? అని సెనేటర్ జాన్ కార్నిన్ వాదిస్తున్నారు. మన ఫెడరల్ వ్యవస్థలో శిక్షించడానికి సిద్ధమైతే ఇప్పటి ఎన్నికలను కోల్పోయినట్టే అవుతుందని ప్రతిపాదించారు. ఫిబ్రవరి 8 నుంచి ట్రంప్ అభిశంసనపై విచారణ ప్రారంభమౌతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News