Thursday, April 25, 2024

టిక్‌టాక్‌కు 45 రోజుల అల్టిమేటం

- Advertisement -
- Advertisement -

Trump issues ultimatum for TikTok deal

 అమెరికా అధ్యక్షుడు హెచ్చరిక
కొనుగోలుపై చర్చిస్తున్నామన్న మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదెళ్ల

న్యూఢిల్లీ: చైనాకు చెందిన వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ కొనుగోలు హాట్ టాపిక్‌గా మారింది. టిక్‌టాక్ కొనుగోలు విషయం 45 రోజుల్లో తేల్చే యాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. టిక్‌టాక్‌కు చెందిన యుఎస్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి చర్చలను కొనసాగిస్తామని ఐటి సంస్థ మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. భారత సంతతికి చెందిన సిఇఒ సత్య నాదె ళ్ల, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన తర్వాత కంపెనీ ఈ విషయం తెలిపింది. జాతీయ భద్రత కారణాల దృష్టా అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించడానికి అత్యవసర ఆర్థిక అధికారాలను ఉపయోగించవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.

నాదెళ్ల, ట్రంప్ మధ్య చర్చల తరువాత అమెరికాలో టిక్‌టాక్ కొనుగోలు చేసే అవకాశంపై చర్చలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపిం ది. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్‌తో వీలైనంత త్వరగా చర్చలు ప్రారంభిస్తామని, సెప్టెంబర్ 15 నాటికి చర్చలను పూర్తి చేస్తామని కంపెనీ పేర్కొం ది. ఈ యాప్‌ను నిషేధిస్తామని ట్రంప్ గత వారం బెదిరించారు. ఈ యాప్ జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని నివేదికలు వచ్చిన తర్వాత అమెరికాలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News