Friday, March 29, 2024

ఓటమిని అంగీకరించాల్సిందే ఫలితాలు మారే అవకాశం లేదు

- Advertisement -
- Advertisement -

Trump must accept defeat: Obama

 

అమెరికా ఎన్నికల అధికారులు ప్రకటించిన ప్రకారం ఎలక్టోరల్ కాలేజీలోని 538 సీట్లలో బిడెన్ 306 గెలుచుకోగా, ట్రంప్ 232కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో జో బిడెన్ ఎన్నికను అంగీకరించేందుకు ట్రంప్‌కు ఇదే తగిన సమయమని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సూచించారు. ఎన్నికల ఫలితాలు మారే అవకాశమే లేదని సిబిఎన్‌ఎస్‌కు ఆదివారం 60 నిమిషాలపాటు ఇచ్చిన ఇంటర్వూలో ఒబామా స్పష్టం చేశారు. అధ్యక్షుడు ప్రజా సేవకుడిగా వ్యవహరించాలని, ఆ పదవి తాత్కాలికమని, ఒబామా హితవు పలికారు. సొంత అహాన్ని పక్కన పెట్టి, వ్యక్తిగత ప్రయోజనాలను విడనాడి దేశం గురించి ఆలోచించాలని ఒబామా సూచించారు. ప్రపంచంలో తాము తలచుకుంటే ఏమైనా చేయగలమనే నియంతలను గతంలో చూశామని, అటువంటిది అమెరికాకు తగదని ఒబామా హితవు పలికారు. ఒబామా తాజా పుస్తకం ‘ప్రామిస్డ్ ల్యాండ్’ ఈ వారంలో విడుదల కానున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News