Saturday, April 20, 2024

ట్రంప్‌తో కూతురు, అల్లుడు

- Advertisement -
- Advertisement -

భారత్‌లో అధికారిక పర్యటనకు ట్రంప్ దాదాపుగా సకుటుంబ సరిపరివారంగా వస్తున్నారు. ఈ నెల 24, 25 తేదీలలో ఆయన భారత్ పర్యటన ఉంది. వాణిజ్య ఇతరత్రా రంగాలపై సంప్రదింపులు పక్కన పెడితే అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ వేడుక, ఆగ్రాలో తాజ్‌మహల్ సందర్శన లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ట్రంప్ వెంట ఆయన భార్య మెలానియా ట్రంప్ కూడా వస్తున్నారు. ఇండియాలో గతంలో పర్యటించి వెళ్లిన కూతురు ఇవాంక, అల్లుడు జెర్డ్ కుష్నేర్‌లు కూడా ట్రంప్ వెంట ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో ఉంటారు. అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్, ఆర్థిక మంత్రి స్టీవెనె న్యుచిన్ బృందంలో కీలకంగా ఉంటారు, మిసెస్ ట్రంప్ కూడా ప్రతినిధి బృందంలో పాలుపంచుకుంటారు.

ఇండియాలో మొత్తం మీద 36గంటలు ఉంటారు. అహ్మదాబాద్‌కు చేరుకున్న తరువాత ఆయన ఆగ్రాకు అక్కడి నుంచి దేశ రాజధానికి వెళ్లుతారు. ట్రంప్ అధికారిక వ్యవహారాలలో అల్లుడు ప్రధాన సలహాదారుడిగా ఉంటూ వస్తున్నారు. కూతురు, అల్లు డు కూడా ట్రంప్ ప్రతినిధి బృందంలో ఉంటారని అమెరికా అధికార వర్గాలు ధృవీకరించినట్లు శుక్రవారం భారతీయ అధికారులు తెలిపా రు. ఈ మేరకు తగు విధంగా వారికి ఆతిథ్యం కోసం ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 25వ తేదీన ఢిల్లీలో అధికారికంగా జరిగే ఉన్నత స్థాయి చర్చలలోరక్షణ, వాణిజ్య సంబంధాలు వంటివి ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయి. ఇక ఇటీవలి కాలంలో ట్రంప్ అధికార యంత్రాంగం వీసా నిబంధనలను కట్టుదిట్టం చేయడం, హెచ్1 బి వీసా ప్రక్రియతో భారతీయులకు ఎదురవుతున్న ఇబ్బందులను ట్రంప్ బృందానికి భారతదేశం తెలియచేస్తుందని వెల్లడైంది.

Trump’s Daughter Ivanka, Son in law tour to India
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News