Friday, April 19, 2024

పదవ తరగతి స్టడీమెటీరియల్ విడుదల

- Advertisement -
- Advertisement -

TS 10th Class Study Material 2021

కార్పోరేట్ సంస్థల నోట్స్ కన్నా అద్భుతంగా ఉంది
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంస

హైదరాబాద్: పదవతరగతి చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న సంకల్పంతో స్టడీ మెటీరియల్ రూపొందించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ స్టడీ మెటీరియల్‌ను మంగళవారం మంత్రి తన కార్యాలయంలో విడుదల చేశారు. డిజిటల్ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత బలోపేతం చేసేలా, పాఠ్యాంశాల్లోని కీలక భావనలను సులభంగా అర్థమయ్యేలా ఈ స్టడీ మెటీరియల్‌ను రూపొందించారని మంత్రి తెలిపారు. ఈ స్టడీ మెటీరియల్‌ను ఆంగ్లం, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో రూపొందించినట్లు చెప్పారు. కార్పోరేట్ సంస్థలు రూపొందించే నోట్స్ కన్నా ఈ స్టడీ మెటీరియల్ అద్భుతంగా ఉందని మంత్రి ప్రశంసించారు.

ప్రస్తుతానికి ఈ స్టడీ మెటీరియల్‌ను www.scert.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మాతృభాషలో సాంకేతిక పదాలను నేర్చుకోవడానికి బహుబాషా నిఘంటువును రూపొందించామని వెల్లడించారు. గణితం, భౌతిక, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం సాంఘిక శాస్త్రాల్లోని సాంకేతిక పదాలను ఆంగ్లం, తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం బాషల్లో రూపొందించామని తెలిపారు. ఇది ప్రాథమిక పరిభాషపై ప్రావీణ్యం పొందడం, ప్రశ్నాపత్రాల్లో ఏకరూపతను పాటించడానికి, అనువాదంలో అస్పష్టతను నివారించడానికి ఇది దోహదపడుతుందని అన్నారు. వివిధ భాషలను నేర్చుకోవాలనుకునే ఆసక్తి ఉన్న వారికి బహుభాషా నిఘంటువు ఉపయుక్తకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిఘంటువు రాష్ట్ర, విద్యా పరిశోధన శిక్షణ సంస్థ చరిత్రలో మరొక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి రఘోత్తంరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, పాఠశాల విద్య సంచాలకులు దేవసేన, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, సంచాలకులు రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News