Home తాజా వార్తలు రేపటి నుంచి తెరుచుకోనున్న బిసి గురుకులాలు

రేపటి నుంచి తెరుచుకోనున్న బిసి గురుకులాలు

TS BC gurukula schools reopening tomorrow

 

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి : బుర్రా వెంకటేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని బిసి గురుకుల విద్యాసంస్థలు ఈ నెల 22 నుంచి ప్రత్యేక్ష పద్ధతిలో పనిచేస్తాయని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఈ మేరకు విద్యా సంస్థలు తిరిగి ప్రారంభించడానికి అవసరమైన జాగ్రత్తలపై ప్రిన్సిపాల్,ఆర్‌సిఓలతో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శానిటైజేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. విద్యార్థులు కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతులతో పాటు పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ జూమ్ మీటింగ్‌లో బిసి గురుకులా కార్యదర్శి మల్లయ్య బట్టు, డిప్యూటీ సెక్రెటరీలు తిరుపతి, ఇందిరా, ఇతర అధికారులు, ప్రిన్సిపల్స్, ఆర్‌సిఓలు పాల్గొన్నారు.

TS BC gurukula schools reopening tomorrow