Home తాజా వార్తలు లాక్ తీసేనా?

లాక్ తీసేనా?

కరోనా స్థితిగతులు, లాక్‌డౌన్, రైతుబంధు, వ్యవసాయం, ఎరువులు, ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాన చర్చ
కరోనా మూడోదశ ఎదుర్కొనే వ్యూహంపై చర్చించనున్న మంత్రివర్గం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం (ఈ నెల 8న) మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరుగనున్నది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాల మీద మంత్రివర్గ సమావేశం ప్రధానంగా చర్చించే అవకాశమున్నది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద స మీక్ష జరగనుంది. అలాగే వానాకాలం పంటల సాగు ప నులు ప్రారంభమైన నేపథ్యంలో పంట పెట్టుబడి సాయం రైతుబంధు విషయంపై కూడా చర్చించనుంది. కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువు లు క్రిమిసంహారక మందుల లభ్యత తదితర వ్యవసాయ స ంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశమున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల కారణంగా రెండోదశ కరోనా తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో ఇంకా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో దీనిని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత తగు ఏర్పాట్ల మీద కేబినెట్ చర్చించే అవకాశమున్నది. కరోనా కట్టడికోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో, దాని పర్యవసానంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమైంది అనే అంశాల మీద కేబినెట్ చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
డయాగ్నస్టిక్ కేంద్రాల ప్రారంభోత్సవం వాయిదా
సోమవారం ప్రారంభించాలనుకున్న 19 జిల్లాల్లో 19 డయాగ్నటిక్ సెంటర్ల కార్యక్రమం వాయిదా పడింది. బుధవారం (ఈ నెల 9వ తేది) ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు ఏక కాలంలో పాల్గొని ఒకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సిఎం తలపెట్టారు. కాగా మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని సిఎం కెసిఆర్ భావించారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయం మీద కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.

TS Cabinet meeting Tomorrow over Corona Crisis