Home తాజా వార్తలు అనాథల జీవితాల్లో వెలుగులు నింపాలి

అనాథల జీవితాల్లో వెలుగులు నింపాలి

TS cabinet sub-committee visited balasadhan

 

వరంగల్ : రాష్ట్రంలోని అనాథల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి వారి జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతో సిఎం కెసిఆర్ ఉన్నారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌లు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ నియమించిన క్యాబినేట్ సబ్ కమిటీ మంత్రి సత్యవతిరాథోడ్ అధ్యక్షతన సుబేదారిలోని బాలాసదన్‌ను సందర్శించింది. ఈ సందర్శనలో రాష్ట్ర జలవనరుల శాఖ చైర్మన్ వి.ప్రకాష్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, మేయర్ గుండు సుధారాణిలున్నారు. ఈసందర్భంగా మంత్రుల సబ్ కమిటీ బాలసదన్‌లోఉన్న సమస్యలను పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. మొన్న జరిగిన క్యాబినేట్ సమావేశాల్లో కరోనా వల్ల అనాథలైన పిల్లల్ని ఆదుకోవాలని సిఎం కెసిఆర్ చెప్పారన్నారు. రాష్ట్రంలో ఉండే అనాథలకు ఏం చేస్తే ఇంకా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయో చెప్పాలని సూచించారన్నారు.

దేశంలోనే ఆదర్శ సిఎంగా ఉన్న కెసిఆర్ గొప్ప మనసుతో అనాథల సమస్యలు పరిష్కరించాలని ఆలోచించారన్నారు. 12 మంది మంత్రులతో కలిసి సబ్ కమిటీ వేయడం జరిగిందని అందులో భాగంగా మంత్రులుగా వరంగల్‌లో బాలసదన్‌ను సందర్శించడం జరిగిందన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అనాథలకు మంచి పాలసీ రాబోతుందన్నారు. అనాథల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు ఈసబ్‌కమిటీ ప్రయత్నం చేయబోతుందన్నారు. దీనికి సహకరించిన సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపి కవిత, వివిధ స్థాయిల్లోని అధికారులు పాల్గొనగా బాలసదన్‌లో అనాథ పిల్లలతో కలిసి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

TS cabinet sub-committee visited balasadhan