Home Default పిజి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

పిజి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

CPGET Result

 

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన పిజి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో ఆరు వర్సిటీలలో ప్రవేశాలకు ఎం.ఎ, ఎం.ఎస్‌సి, ఎం.కాం తదితర పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు మొట్టమొదటిసారి ఆన్‌లైన్ పరీక్ష విధానంలో(సిబిటి-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఉమ్మడి పిజి ప్రవేశ పరీక్ష(సిపిజిఇటి-20 19)ను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మొదటిసారి నిర్వహించనున్న సిపిజిఇటి పరీక్షను ఈ సారి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుందని చెప్పారు. అన్ని యూనివర్సిటీ పరిధిలో పిజి, పిజి డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ కోర్సులతో కలిపి మొత్తం 80 కోర్సులకు 60 సబ్జెక్టులలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సిపిజెట్‌లో 74,815 మంది విద్యార్థులు 94.54 శాతం ఉత్తీర్ణత సాధించిన్నారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జెఎన్‌టియులో 2019-20 సంవత్సరానికి గాను పిజి, డిప్లొమా, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

TS CPGET Result Released