Home కెరీర్ దోస్త్ ప్రత్యేక విడతలో 38,441 సీట్ల కేటాయింపు

దోస్త్ ప్రత్యేక విడతలో 38,441 సీట్ల కేటాయింపు

TS dost special phase seat allotment results

 

మనతెలంగాణ/హైదరాబాద్ : డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్) ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో 38,441 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ప్రత్యేక విడతలో మొత్తం 39,671 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నట్లు దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి తెలిపారు. తక్కువ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న కారణంగా 1,230 మంది విద్యార్థులకు సీట్లు లభించలేదని అన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు బుధవారం నుంచి ఈ నెల 26వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. ఇంట్రా కాలేజ్ కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు ఈ నెల 27 నుంచి 29 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని,ఈ నెల 30న సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు తెలిపారు.

TS dost special phase seat allotment results