Saturday, April 20, 2024

సెప్టెంబర్ 9నుంచి ఎంసెట్?

- Advertisement -
- Advertisement -

2న పాలిసెట్, ఈ నెల 31న ఇసెట్, 20 నుంచి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు డిజిటల్ క్లాసులు

సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ ప్రవేశాలు, 17 నుంచి ఆన్‌లైన్ తరగతులు
విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
హైకోర్టు అనుమతితో ప్రవేశ పరీక్షలు : పాపిరెడ్డి

TS EAMCET 2020 From September 9

మన తెలంగాణ/హైదరాబాద్: సెప్టెంబర్ 9 నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కా నున్నాయి. ఈ నెల 31న ఇసెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్ పరీక్షలు జరుగనున్నాయి. కరోనా నేపథ్యంలో వివిధ ప్రవేశ పరీక్షలు, విద్యా సంవత్సరం అమలు విధివిధానాలను ఖరారు చేసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డితో సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 9, 10,11,14 తేదీలలో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 20వ తేదీ నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభమవుతాయని తె లిపారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్, టి సాట్ ద్వారా తరగతులు నిర్వహిస్తామన్నారు. అలాగే సెప్టెంబర్ 1 నుంచి 3 నుంచి 5వ తరగతుల విద్యార్థులకు డిజిటల్ తరగతులు ఉంటాయ ని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఈ నెల 17 నుంచి 50 శాతం టీచర్ల హాజరు తప్పనిసరి కానుంది. ఈ నెల 20 నుంచి దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి.

వృత్తి విద్యా కోర్సులతో మంచి భవిష్యత్తు
వృత్తి విద్యా కోర్సులకు మంచి డిమాండ్ ఉందని అన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాయనున్న విద్యార్థులకు ఇంద్రారెడ్డి ట్రస్ట్ ద్వారా ఉచితంగా స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్లు (పాత ప్రశ్న పత్రాల)తో కూడిన పుస్తకాలను మంత్రి అందజేశారు. సోమవారం మంత్రి కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మెన్ టి.పాపిరెడి, విద్యా శాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్, వైస్ చైర్మన్ లింబాద్రి, పాఠశాల కమిషనర్ దేవసేనతో కలిసి వాటిని అభ్యర్థులకు అందించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు బాగా చదువుకుని మంచి ర్యాంక్‌లు సాధించాలని అన్నారు. పరీక్షలు ఎపుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ మెటీరియల్ అభ్యర్థులకు ఎంత గానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రణాళిక బద్దంగా చదివి రాణించాలని చెప్పారు.

హైకోర్టు అనుమతితో ప్రవేశ పరీక్షలు: పాపిరెడ్డి
హైకోర్టు అనుమతితో ప్రవేశ పరీక్షలు నిర్వహణ నిర్వహించాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి. పాపిరెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు అనుమతిస్తే ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డిగ్రీ, పిజి ఫైనల్ ఇయర్ పరీక్షలు సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని అన్నారు. ఇప్పటికే ఆలస్యమైనందున కోర్టు అనుమతితో త్వరలో అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు చేస్తామని అన్నారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలి ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేయగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో సెట్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి. కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో తెలియని నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

TS EAMCET 2020 From September 9

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News