Friday, March 29, 2024

1నుంచి ఎంసెట్ బైపిసి కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

TS EAMCET BIPC Counselling Schedule Released

కన్వీనర్ కోటాలో బి.ఫార్మసీలో 7,522 సీట్లు
గణితంలో బ్రిడ్జి కోర్సు చేయాలన్న నిబంధన మినహాయింపు

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంసెట్ బైపిసి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. డిసెంబరు 1 నుంచి 3 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. డిసెంబరు 3, 4 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్, 3 నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. డిసెంబరు 7న బి.ఫార్మసీ, ఫార్మా డి, బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయించనున్నారు. సీటు పొందిన అభ్యర్థులు డిసెంబరు 7 నుంచి 10 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ మేరకు మొదటి, తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ప్రైవేట్ కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం డిసెంబరు 19న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొన్నారు.

డిసెంబరు 13 నుంచి తుది విడత కౌన్సెలింగ్

తొలి విడత సీట్ల కేటాయింపులో మిగిలిన సీట్ల కోసం డిసెంబరు 13 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. డిసెంబరు 13 నుంచే ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ ఫీజు చెల్లించి..సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. డిసెంబరు 14న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 13 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. 17న తుది విడత సీట్ల కేటాయించనున్నారు. డిసెంబరు 17 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, 18 నుంచి 20 వరకు కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

నాలుగు కోర్సుల్లో 8,773 సీట్లు

రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో కన్వీనర్ కోటాలో 7,522 బి.ఫార్మసీ సీట్లు ఉన్నాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. అందులో ఐదు వర్సిటీ కళాశాలల్లో 293 సీట్లు, 113 ప్రైవేట్ కాలేజీల్లోని 7,229 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే 55 కాలేజీల్లో 1,189 ఫార్మ్ డి సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బి.టెక్ బయోటెక్నాలజీలో 29, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్‌లో 33 సీట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. మొత్తం ఐదు కోర్సుల్లో 8,773 ఉన్నాయని వెల్లడించారు. బైపిసి విద్యార్థులు బి.టెక్ బయోటెక్నాలజీలో చేరేందుకు గణితంలో బ్రిడ్జి కోర్సు చేయాలన్న నిబంధనకు మినహాయించామని పేర్కొన్నారు. వీటిలో ఎంపిసి అభ్యర్థులు చేరగా మిగిలిన సీట్లను బైపిసి విద్యార్థులకు కేటాయిస్తామని తెలిపారు. వ్యవసాయ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలను ఆయా వర్సిటీలు నిర్వహించనున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News