Home తాజా వార్తలు వెబ్‌సైట్‌లో ఎంసెట్ హాల్‌టికెట్లు

వెబ్‌సైట్‌లో ఎంసెట్ హాల్‌టికెట్లు

Ts-Eamcet

ఇంజనీరింగ్‌కు 1,41,716,
అగ్రికల్చర్, ఫార్మసీకి 74,646 దరఖాస్తులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్ హాల్ టికెట్లు వెట్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని కన్వీనర్ ఎన్.యాదయ్య తెలిపారు. అభ్యర్థులు www.eamcet.tsche.ac.in వెబ్‌సైట్ నుంచి మే 1వ తేదీలోగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఎంసెట్ పరీక్షకు తెలంగాణలో 15 టెస్టు జోన్లు, ఎపిలో 3 టెస్టు జోన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు మొత్తం 1,41,716 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అలాగే అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 74,646 మంది, రెండింటికీ కలిపి 234 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షను మే 3,4,6 తేదీలలో, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షకు మే 8,9 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

TS EAMCET hall ticket 2019 released on website