Friday, March 29, 2024

నేడు ఎంసెట్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టిఎస్ ఎంసెట్ ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఫలితాలకు సంబంధించిన షెడ్యూల్‌లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. తొలుత జెఎన్‌టియుహెచ్‌లో ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించగా, తాజాగా జవహర్‌లాల్ నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జెఎన్‌ఎఎఫ్‌ఎయు)లో ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, జెఎన్‌టియుహెచ్ వైస్ ఛాన్స్‌లర్ కట్టా నరసింహారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్, కో కన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఎం సెట్ అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించగా, 12 నుంచి 15 వరకు ఆరు విడుతల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగాయి. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసి అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు. తాజాగా ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News