Friday, March 29, 2024

22 నుంచి ఇసెట్ దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

TS ECET online application submission from March 22

జూలై 1వ తేదీన పరీక్ష
షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి

హైదరాబాద్ : రాష్ట్రంలో బి.టెక్, బి.ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీకిగాను పాలిటెక్నిక్, బిఎస్‌సి(మ్యాథమెటిక్స్) విద్యార్థులకు నిర్వహించే ఇసెట్ -పరీక్ష జూలై 1వ తేదీన నిర్వహించనున్నారు. ఇసిఇ,ఇఐఇ,సిఎస్‌ఇ, ఇఇఇ స్ట్రీమ్‌లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సిఐవి, సిహెచ్‌ఇఎం, ఎంఇసి, ఎంఐఎన్, ఎంఇటి,పిహెచ్‌ఎం, బిఎస్‌ఎం విభాగాలకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహణ జరగనుంది. ఈ మేరకు ఇసెట్ ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఇసెట్ కమిటీ సమావేశంలో పరీక్ష షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్లు ఆర్.లింబాద్రి, వి.వెంకటరమణ, ఇసెట్ కన్వీనర్ సిహెచ్ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనెల 17వ తేదీన ఇసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఈ నెల 22వ తేదీ నుండి మే 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 ఆలస్య రుసుంతో మే 31వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో జూన్ 14 వరకు, రూ.2,500 అపరాధ రుసుంతో జూన్ 24వ వరకు, రూ. 5 వేల అపరాద రుసుంతో జూన్ 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.800(ఎస్‌సి,ఎస్‌టిలకు రూ. 400)గా నిర్ణయించారు. ఇతర వివరాలకు అభ్యర్థులు https://ecet.tsche.ac.in వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు. ఈ ఏడాది జవహర్‌లాల్ నెహ్రు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(జెఎన్‌టియూహెచ్) ఇసెట్ పరీక్షను నిర్వహిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News