Tuesday, April 16, 2024

ఎంసెట్‌ ఫలితాలు విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల ఎంసెట్ ర్యాంకులను ప్రకటించారు. ఇంజనీరింగ్‌లో 82.07 శాతం విద్యార్థులు అర్హత సాధించగా…అగ్రికల్చర్ మెడికల్‌లో 98.48శాతం మంది విద్యార్థులు అర్హత పొందారు. ఇంజనీరింగ్ విభాగంలో సత్తి కార్తికేయ(వెస్ట్ గోదావరి, ఏపీ) ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచారు. అలాగే వెంకట ప్రణీత్‌(రాజంపేట, కడప)కు సెకండ్ ర్యాంక్ రాగా, ఎండీ మతిన్ (హైదరాబాద్, టోలిచౌకి)మూడో ర్యాంక్ సాధించారు. అలాగే అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో మండవ కార్తికేయ(బాలానగర్, హైదరాబాద్) ఫస్ట్ ర్యాంక్ సాధించగా…హిమని శ్రినిజ (రంగారెడ్డి)సెంకండ్ ర్యాంకర్‌గా నిలిచారు.

విడుదల చేసిన ఫలితాలను విద్యార్థులు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 4, 5, 6తేదీల్లో ఇంజినీరింగ్, 9, 10తేదీల్లో వ్యవసాయ, ఫార్మా ఎంసెట్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.

ఫలితాల కోసం క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి.

TS EMCET 2021 Results Website2
TS EMCET 2021 Results Website1

TS EMCET 2021 Results Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News