Thursday, February 2, 2023

బతుకమ్మ ఆడిన గవర్నర్ తమిళిసై…

- Advertisement -

tamilisaiహైదరాబాద్: బతుకమ్మ సంబురాలను రాజ్‌భవన్ ప్రాంగణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియచేశారు. మహిళలు బంగారం, దుస్తులతో పాటు పూలను బాగా ఇష్టపడతారని శరత్ రుతువు ఆగమనాన్ని తెలియచేసే చక్కని పూల పండుగ బతుకమ్మ అని ఆమె అభివర్ణించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, కలవారి కోడలు ఉయ్యాలో, కలికి కామాక్షి ఉయ్యాలో అని రాగతాళ యుక్తంగా తెలుగులో గవర్నర్ ఆలపించారు.

ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ అభిమానులు, రచయిత్రులు శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, శ్రీమతి ఆవుల మంజులత, శ్రీమతి దీపికారెడ్డి ఆమె శిష్య బృందం తదితరులు 200 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. రాజ్‌భవన్ ప్రాంగణంలో అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి గంటపాటు ఈ వేడుకలను నిర్వహించనున్నట్టు గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. నేడు మహిళా జర్నలిస్టులు, న్యాయవాదులు, అక్టోబర్ 4వ తేదీన విద్యార్థులు పాల్గొంటారని, 5వ తేదీన రాజ్‌భవన్ మహిళా ఉద్యోగినులు, రాజ్‌భవన్ పరివారం పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

TS Governor Bathukamma Celebrations At Raj Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles