Friday, March 29, 2024

బడులకు ఉపాధ్యాయులు..

- Advertisement -
- Advertisement -

రేపటి నుంచి బడులకు ఉపాధ్యాయులు
ఆన్‌లైన్ తరగతుల పాఠాలకు సందేహాలు నివృతి
రోజుకు సగం మంది టీచర్లు విధులకు హాజరు
విద్యార్దులు తల్లిదండ్రుల అనుమతిలో స్కూళ్లకు వెళ్లాలి

హైదరాబాద్: నగరంలో రేపటి(సోమవారం) నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అయితే విద్యార్దులకు తరగతులు నిర్వహించకుండా కేవలం ఉపాధ్యాయలే హాజరైతారు. పాఠ్యాంశాల్లో ఏమైనా సందేహాలుంటే టీచర్లు నివృత్తి చేస్తారు. ఈమేరకు అన్ని స్కూళ్లలో సగం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరు కానున్నారు. అన్‌లాక్ మార్గదర్శకాల ప్రకారం స్కూళ్లు తెరుస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్ తరగతులు జరుగుతుందన్న టీచర్లు నిర్వహించాల్సి బాధ్యతలు, ఇతర అంశాలపై స్పష్టత ఇచ్చారు. ఉపాధ్యాయులు ఒకరోజు విడిచి మరో రోజు విధులకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నందున పాఠాల వారీగా వర్క్‌షీట్ల పంపిణీ, వాటి ఆధారంగా విద్యార్దుల సామర్దాలను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని ఉపాధ్యాయలకు విద్యాశాఖ పేర్కొంది.

టీచర్ల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో విద్యార్దులు పాఠశాలలకు వెళ్లవచ్చని చెబుతున్నారు. 9, 10 తరగతల విద్యార్దులకు పాఠ్యాంశాల్లో ఏమైనా అనుమానాలుంటే టీచర్లను అడిగి తెలుసు కోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లాలో 689 ప్రభుత్వ,ఉన్నత, ప్రాథమిక పాఠశాలుండగా వాటిలో 82,653మంది విద్యార్దులు విద్యనభ్యసిస్తుండగా, 4600మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాల్లో ఉపాధ్యాయులు కోవిడ్ నిబంధనలు పాటించి విద్యార్దులు సందేహాలు తీర్చాలని జిల్లా విద్యాధికారులు సూచించారు.

TS Govt allows 50% Staff at Schools from Sep 21 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News