Home తాజా వార్తలు కంటైన్మెంట్ జోన్లల్లో 31వరకు లాక్‌డౌన్ పొడిగింపు..

కంటైన్మెంట్ జోన్లల్లో 31వరకు లాక్‌డౌన్ పొడిగింపు..

TS Govt extends lockdown till July 31 in Cantonment jones

హైదరాబాద్‌ః నగరంలోని కంటైన్మెంట్ జోన్లల్లో ఈనెల 31వరకు లాక్‌డౌన్ పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో రాత్రి 10 గంట నుంచి ఉదయం 5గంటల వరకు కర్య్వూ కొనసాగనుంది. లాక్‌డౌన్ నుంచి ఎమర్జెన్సీ సేవలకు ప్రభుత్వం మినహింపునిచ్చింది. రాత్రి తొమ్మిది గంటల కల్లా అన్ని షాపులు మూసివేయాలని ఆదేశించింది. లాక్‌డౌన్ నిబంధనలు తక్షణమే అమలుచేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నూతన లాక్‌డౌన్ గైడ్‌లైన్స్ అమల్లోకి రానున్నాయి. కాగా, రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీరోజూ వెయ్యి కేసుల వరకు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 16వేలు దాటింది.

TS Govt extends lockdown till July 31 in Cantonment zones