Friday, April 19, 2024

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు పెంపు

- Advertisement -
- Advertisement -

2 Singareni workers dies after Roof collapse

మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26వ తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండి శ్రీధర్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా శాసనసభ్యుల అభ్యర్థన మేరకు పదవీ విరమణ వయస్సుపెంపుపై సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43, 899 మంది సింగరేణి కార్మికులు అధికారులకు లబ్ధి చేకూరనున్నది. కాగా, రామగుండం నియోజక వర్గ కేంద్రంలో సింగరేణి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి.
సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కారాలు అంశంపై ఆ ప్రాంత పరిధిలోని ప్రజా ప్రతినిధులతో ప్రగతి భవన్‌లో మంగళవారం సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు, మంచిర్యాల నియోజకవర్గం శాసనసభ్యుడు దివాకర్ రావు, భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకట రమణారెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వర్ రావు, రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్, ఆసిఫాబాద్ శాసనసభ్యుడు ఆంత్రం సక్కు, సిర్పూర్ ఖాగజ్ నగర్ శాసనసభ్యుడు కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు.

TS Govt extends retirement age of Singareni workers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News