Friday, April 19, 2024

మరింత కఠినంగా లాక్ డౌన్.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ని బంద్ కానున్నాయి. ప్రజలు బయటికి రాకుండా లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం జీవొ జారీ చేసింది. బైక్ పై ఒక్కరు, కారులో ఇద్దరికి మాత్రమే అనుమతి. అత్యవసర సేవలు లాక్ డౌన్ నుంచి మినహాయించింది. రాత్రి 7 గంటల తర్వాత నిత్యావసర అనుమతులకు నిరాకరణ. నివాస ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల మేర ప్రయాణానికి అనుమతి. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు 8 మందితో కమిటీ ఏర్పాటు. సివిల్ సప్లై కమీషనర్, రవాణా శాఖ కమిషనర్, హైదరాబాద్ పోలీస్ ఐజి, డ్రగ్ కంట్రోలర్ డైరెక్టర్, హార్టికల్చరల్ డైరెక్టర్, మార్కెటింగ్ డైరెక్టర్, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్, డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండిలు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.

TS Govt issued Jeevo for Lockdown enforced strictly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News