Friday, March 29, 2024

నిమ్స్‌లో వ్యాక్సిన్ దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ

- Advertisement -
- Advertisement -

నిమ్స్‌లో వ్యాక్సిన్ దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ
ఐడి,ఆధార్ లేకుండానే వ్యాక్సినేషన్
మూడు రోజుల్లో నివేదికివ్వనున్న అధికారులు

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ప్రభుత్వం ఆదేశాల మేరకు నిమ్స్‌లో వ్యాక్సిన్ పంపిణీలో చోటుచేసుకున్న అవకతవకలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శనివారం ముగిసింది. నిమ్స్‌లో 7వేల మంది అనర్హులకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఈక్రమంలో నిమ్స్ లో 18 నుంచి 44 సంవత్సరాల వయస్సుల వారికి అర్హత లేకున్నా వ్యాక్సిన్ వేశారన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. ఇందులో భాగంగా నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ కె.వి. క్రిష్ణారెడ్డిని అధికారులు విచారించారు. నిమ్స్‌లో వ్యాక్సినేషన్ కోసం ఎటువంటి నిబంధనలు అనుసరించారు, ఉద్యోగులకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏ అంశాలు పరిగణనలోకి తీసుకున్నారని ప్రశ్నించారు.నిమ్స్‌లో అర్హత లేని లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేస్తున్నారనే ఆరోపణలు వచ్చినప్పటికీ మెడికల్ సూపరింటెండెంట్ స్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న అంశాలపై క్రిష్టారెడ్డి నుంచి విచారణాధికారులు వివరణ తీసుకున్నారు.

వ్యాక్సిన్ తీసుకున్న 7వేల మందికి ఫస్ట్ డోస్ తర్వాత సర్టిఫికెట్ రాలేదని, నకిలీ ప్రూఫ్ లతో వ్యాక్సిన్ వేయడంతో పాటు రికార్డుల తారుమారు చేశారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిమ్స్‌లో ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరుతో 7వేల మంది ఆన్హర్హులకు వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మరో మూడు రోజుల్లో విజిలెన్స్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించనున్నారు. అయితే ఈ నివేదిక తరువాత సంబంధిత అధికారులపై వేటు పడే అవకాశం ఉందని నిమ్స్ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
సంతకం ఫోర్జరీ చేశారు:
నిమ్స్‌లో వ్యాక్సినేషన్ అవకతకవలపై అధికారుల విచారణలో మెడికల్ సూపరింటెండెంట్ తన సంతకం ఫోర్జరీ చేశారంటూ వివరణ ఇచ్చారు. కాగా వాక్సిన్ వేసేముందు ఐడీ కార్డు, ఆధార్ పరిశీలించకుండా ఎలా ఇచ్చారంటూ నిలదీశారు. మార్చి,ఏప్రిల్ లో వాక్సిన్ వేసుకున్న అందరి వివరాలను ఆన్‌లైన్‌లో ఎందుకు రిజిష్టర్ చేయలేదని ఆయనను ప్రశ్నించారు.
విచారణ కొనసాగుతుంది: నిమ్స్ డైరెక్టర్ 
వ్యాక్సిన్ దుర్వినియోగంపై విచారణ కొనసాగుతోందని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కెవి కృష్ణారెడ్డి పాత్రపైనా దర్యాప్తు జరుగుతోందని, మార్చి, ఏప్రిల్ నెలల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నామని, ఆధార్ కార్డు లేకుండా వ్యాక్సిన్ ఇస్తే కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం. విజిలెన్స్ నివేదిక తర్వాత సర్టిఫికెట్ల జారీపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

TS Govt orders to inquiry into vaccine manipulate in NIMS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News