Home తాజా వార్తలు రూ.116 కోట్లతో గ్రామాల్లో ప్రకృతి వనాలు

రూ.116 కోట్లతో గ్రామాల్లో ప్రకృతి వనాలు

TS govt release by Rs 116 cr for palle prakruthi vanam developed

 

పచ్చదనమే ప్రభుత్వ లక్ష్యం
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ బ్యూరో : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించాలనే సంకల్పంతో రాష్ర్టంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలలోని మండలాలలో బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంపొందించడానికి రాష్ర్టంలో రూ.116 కోట్ల వ్యయంతో 19,472 పల్లె ప్రకృతి వనరుల నిర్మాణాన్ని చేపట్టడం జరుగగా, 19,413 (99.9%) పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన తెలిపారు.

నిర్మాణంలో ఉన్న మిగితా 59 పల్లె ప్రకృతి వనాలను పూర్తిచేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. పల్లె ప్రకృతి వనాలకు గ్రామీణ ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో మండలానికి ఒకటి చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారని మంత్రి తెలిపారు. మండల కేంద్రంలో గాని లేదా మండల కేంద్రంలో భమి లభించినట్లయితే మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీలో పది ఎకరాల స్థలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయబడతాయని ఆయన తెలిపారు.

ఒక్కొక్క పల్లె ప్రకృతి ఏర్పాటు చేయడానికి 40 లక్షల రూపాయలు వ్యయం చేయబడతాయని ఆయన తెలిపారు. ఒక ప్రకృతి వనంలో దాదాపు 31,000 మొక్కలన పెంచుతామని ఆయన తెలిపారు. అందు నిమిత్తం ఇప్పటివరకు 535 మండలాలలో పది ఎకరాల చొప్పున ఐదు వేల 300 ఎకరాల భూమిని గుర్తించామని తెలిపారు. మిగుతా పది మండలాల్లో భూమి ఎంపిక ప్రక్రియ వెంటనే పూర్తవుతుందని త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమాల వల్ల ఏ గ్రామానికి వెళ్లిన పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. హరితహారం శోభ ఇనుమడిస్తూన్నదని మంత్రి అన్నారు.

TS govt release by Rs 116 cr for palle prakruthi vanam developed