Saturday, April 20, 2024

మూడునాలుగు రోజుల్లో లాక్‌డౌన్‌పై నిర్ణయం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

TS Govt to be held Lockdown in Hyderabad

హైదరాబాద్‌ః తెలంగాణలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. నగరంలో మళ్లీ లాక్‌డౌన్ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. జిహెచ్‌ఎంసి పరిధిలో కొన్ని రోజులపాటు లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో మరో 15 రోజులపాటు లాక్‌డౌన్ విధించాలని ప్రతిపాదనలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అన్ని ప్రతిపాదనలపై చర్చించి త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. మూడు, నాలుగు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు సిఎం కెసిఆర్ చెప్పారు. అవసరమైతే మూడునాలుగు రోజుల్లో కేబినెట్ సమావేశం నిర్వహిస్తామన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. పాజిటీవ్ కేసులు పెరుగుతుండడంతో చెన్నైలో కూడా లాక్‌డౌన్ విధించారని సిఎం కెసిఆర్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News