Thursday, April 18, 2024

ఫిర్యాదుల కేంద్రం

- Advertisement -
- Advertisement -

ఒకే గూటికి సామాజిక మాధ్యమాల ద్వారా అందే కంప్లైంట్లు తక్షణమే
వాటికి పరిష్కారం, త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు
సమస్య పరిష్కారం అయ్యిందో లేదో తెలుసుకునేందుకు కాల్‌సెంటర్

TS Govt to Establish Grievance redressal system

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజల ఫిర్యాదులు తెలుసుకుని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రజల సౌకర్యార్థం త్వరలో ఫిర్యాదుల కేంద్రం (గ్రీవెన్స్ రె డ్రసెల్ సిస్టం) ఏర్పాటు చేయబోతుంది. అయితే ఈ పద్ధతి ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ, సరికొత్త రూపంలో అన్ని రకాల ఫిర్యాదులకు పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ఒక వేదికను ఏర్పాటు చేయనుంది. వాట్సాప్, ఫోన్, మెస్సెజ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా అందే ఫిర్యాదులన్నీ ఒకేచోటికి చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇకపై ప్రజల ఆర్జీలు ఏ రూపంలో వచ్చినా ఒకే విధానం ద్వారా పరిష్కారం చూపాలన్నదే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఫిర్యాదుదారులకు ఫోన్ చేసి, సమస్య పరిష్కారం అయిందో లేదో కూడా ఈ కాల్ సెంటర్ ద్వారా వాకాబు చేస్తారు. ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం కోసం ప్రభుత్వ అనుమతితో రాష్ట్ర ఐటి శాఖ తాజాగా టెండర్లు కూడా పిలిచినట్లు తెలిసింది. రానున్న రెండు నెలల్లో ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ విధానంలో ఉన్నతాధికారులు కూడా ప్రతి ఫిర్యాదును పరిశీలించే అవకాశం ఉండటంతో పాటు సత్వరమే పరిష్కారం చూపే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది. ఇక్కడ నేరుగా కలెక్టర్‌కు బాధితులు సమస్యలను ఫిర్యాదు రూపంలో అందిస్తే తక్షణమే పరిష్కారించాలని ఆదేశాలు జారీ చేస్తారు.

అలాగే రాష్ట్రస్థాయిలో ఫిర్యాదులు కూడా నేరుగా సచివాలయానికి వచ్చి విజిటింగ్ సమయాల్లో ఉన్నతాధికారులకు కలిసి చెప్పుకునేవారు. అయితే బిఆర్‌కెఆర్ భవన్‌లో సచివాలయం ఏర్పాటు అయినప్పటికీ నుంచి ఆ పరిస్థితి లేదు. అదే సమయంలో కరోనా నేపథ్యంలో ఏ అధికారి ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితులు. ప్రజలు బయటకు వచ్చి, ముఖ్యంగా రాష్ట్ర పరిపాలన కొనసాగే సచివాలయానికి వచ్చేంత అనుకూలత ఇప్పుడు లేదు. దీనిపై ఆలోచన చేసిన ప్రభుత్వం ప్రజల ఫిర్యాదులు తీసుకునేందుకు ఆన్‌లైన్ సిస్టంను ముందుకు తీసుకువస్తోంది. ప్రస్తుతం ట్రెండ్ అంతా సోషల్ మీడియాదే. ముఖ్యంగా ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా సమస్యను నేరుగా మంత్రులకే కొందరు బాధితులు ట్యాగ్ చేస్తున్నారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ముఖ్యమైన వాటికి స్పందిస్తున్నారు. ప్రతీ ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ఈ రోజుల్లో వాట్సాప్, ఫేస్‌బుక్, సాధారణ మెస్సెజ్‌లు, ట్విట్టర్ ఇలా ఏ రకంగానైనా ఎవరైనా ఫిర్యాదులు అందిస్తే వాటిని వెంటనే పరిష్కరించాలని, ప్రస్తుతం ఉన్న సమయంలో ఇదే మంచి మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో అన్ని శాఖలను ఐటి శాఖతో అనుసంధానిస్తారని తెలిసింది.

TS Govt to Establish Grievance redressal system

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News