Saturday, April 20, 2024

నేటి నుంచి మళ్లీ టీకా

- Advertisement -
- Advertisement -

TS Govt to Start Vaccination from Tomorrow

మన తెలంగాణ/హైదరాబాద్: నేటి నుంచి మళ్లీ కరోనా వ్యాక్సినేషన్ పుఃన ప్రారంభం కానుంది. సుమారు 500 కేంద్రాల్లో ప్రైవేట్ హెల్త్‌కేర్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. వాస్తవంగా ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే 1,54,396 మంది హెల్త్‌కేర్ వర్కర్లు కొనిన్‌లో నమోదు కాగా, జనవరి 30 వరకు 56,865(37 శాతం) మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ తర్వాత పల్స్ పోలియో నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే ఈ రోజు నుంచి మిగతా వారందరికీ టీకా పంపిణీ జరగనుంది. అంతేగాక కొవిన్‌లో నమోదై ఇప్పటి వరకు టీకా తీసుకొని ప్రభుత్వ సిబ్బందికీ బుధవారం నుంచి శుక్రవారం వరకు వ్యాక్సిన్ వేయనున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఈనెల 15వ తేది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ కే ర్ వర్కర్లకు సెకండ్ డోసు ఇవ్వనున్నారు. ఈమేర కు తొలి డోసు తీసుకున్న హెల్త్‌కేర్ వర్కర్లంతా సి ద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ మంగళవారం ప్ర కటించింది. అయితే కొవిన్‌లో నమోదై ఇప్పటి వ రకు టీకా తీసుకోని వారు ఈనెల 5వ తేది లోపు తీసుకోవాలని వైద్యశాఖ సూచించింది. ఈ తర్వా త ఎట్టి పరిస్థితుల్లో టీకా ఇచ్చేది లేదని అధికారులు తేల్చిచెప్పారు. ఇప్పటికే మాప్ ఆఫ్ రౌండ్ ఒకసారి అవకాశం ఇచ్చిన్నప్పటికీ పదిహేను శా తం మంది ఆందోళనతో టీకా తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో వారికి ప్రత్యేక టీంల తో కౌన్సిలింగ్ ఇప్పించి వైద్యశాఖ మరో అవకాశాన్ని ఇచ్చింది. నేటి నుంచి 5వ తేది వరకు కచ్చితంగా టీకా తీసుకోవాలని పేర్కొంది. ఈక్రమంలోఈ సారైనా టీకా వేసుకొని సురక్షితంగా ఉం డాలని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కొవిన్ సాప్ట్‌వేర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 3,25,771 మంది సిబ్బంది నమోదు కాగా, వీరిలో ఇప్పటి వరకు 1,65,880 మంది టీకా తీసుకున్నారు.
1.87 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా…
ఈనెల 6వ తేది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1.87 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. అయితే ఈ సెక్టార్‌లోనూ పది నుంచి పదిహేను శాతం మంది టీకా తీసుకోవడానికి ఆసక్తి లేనట్లు తాము గుర్తించామని, వారికీ కౌల్సిలింగ్ ద్వారా టీకాపై అవగాహన కల్పిస్తామని వైద్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈరోజు నుంచి టీకా కార్యక్రమం ప్రతి వారంలో నాలుగు రోజులు తప్పనిసరిగా జరుగుతోందని అధికారులు అంటున్నారు. వీరికి ఈనెల చివరి వరకు వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసి మార్చి నుంచి 50 ఏళ్ల పై బడిన వారికి, 50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత కేంద్రం నుంచి అనుమతి రాగానే సాధారణ ప్రజలకు టీకాలు ఇస్తామని ఆరోగ్యశాఖ చెబుతోంది. అయితే హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రస్తుతం ఉంచితంగా పంపిణీ చేస్తుండగా, మిగతా వారికి ఫ్రీగా ఇస్తారా? లేదా? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ బెటర్..
దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌లో తెలంగాణ ముందంజలో ఉందని అధికారులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్‌కేర్ వర్కర్లలో ఇప్పటి వరకు సగటున 75 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు వైద్యశాఖ తీసుకున్న కీలక నిర్ణయాలతో వ్యాక్సినేషన్ సక్సెస్‌పుల్‌గా కొనసాగుతుందని వైద్యశాఖ అభిప్రాయపడుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారిలో స్పల్ప సమస్యలు మినహా ఎవరూ సీరియస్ కండీషన్‌లో లేరని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

TS Govt to Start Vaccination from Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News