Thursday, April 25, 2024

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదిలీ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇ.శ్రీధర్‌ను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని సూచించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ యస్మీన్ భాషకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. అదే సమయంలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలను చూస్తున్న చిత్రా రామచంద్రన్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆమెకు రోడ్లు, భవనాల శాఖ భాధ్యతలు కూడా చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు చేయకపోయినా.. పనితీరులో ఆలసత్వం ప్రదర్శిస్తే ఐఎఎస్‌లకు బదిలీ తప్పదని ఈ ఉత్తర్వులతో ప్రభుత్వం స్పష్టం చేసింది. పల్లె, పట్టణ ప్రగతి అమలులో నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఆలసత్వం ప్రదర్శించడంతోనే బదిలీ చేశారని తెలిసింది. అదే సమయంలో నిర్లక్షంగా వహిస్తున్న ఇతర జిల్లాల కలెక్టర్లు, శాఖ ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు కూడా ప్రభుత్వం పరోక్ష హెచ్చరిక ఈ బదిలీలతో చేసింది.

TS Govt to Transfer Nagarkurnool Collector

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News